Mushfiqur apologises for rash shot that led to Bangladesh's narrow loss to India

Mushfiqur apologises to nation for loss to india in t20 worldcup

Bangladesh, Bangladesh vs India, ICC WT20 2016, India, India vs Bangladesh, Mushfiqur Rahim, T20 World Cup

Still smarting from a reckless shot that derailed Bangladesh from the course of victory against India, Mushfiqur Rahim has apologised to the nation, blaming his impulsiveness for the one-run defeat in Bengaluru.

విన్నంగ్ షాట్ కోట్టబోయి విక్కెట్ చేజార్చుకున్నా..!

Posted: 03/27/2016 03:11 PM IST
Mushfiqur apologises to nation for loss to india in t20 worldcup

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో ఈ నెల 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తాను ఆడిన షాట్ విన్నింగ్ షాట్ అనుకున్నానని, కానీ విక్కట్ చేజారుతుందని భావించలేదని బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీం అవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో తన అట తీరుపై ఆయన చాలా బాధపడుతున్నాడు. తాను చాలా నిర్లక్ష్యంగా షాట్ ఆటడం వల్లే భారత్ చేతిలో ఓటమి పాలయ్యామని చెప్పాడు. జట్టు ఓటమికి తానే కారణమని తనను క్షమించాలని దేశ అభిమానులను కోరాడు.

తాను ఆ విధంగా ఔట్ కాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. విన్నింగ్ షాట్ కోట్టి అక్కడున్న ఉత్కంఠ వాతావరణానికి బ్రేక్ కల్పిద్దామని అనుకున్నాను కానీ, అలా జరుగుతుందని తాను ఊహించలేదన్నాడు. తాను ఔటవ్వక ముందు రెండు బంతులను బౌండరీలను తరలించిన తర్వాత ఆ ఒక్క షాట్ జట్టు ఓటమికి దారితీసిందన్నాడు. తాను డీప్ సైడ్ ఆడిన షాట్ సిక్స్ అయింటే... అది గ్రేట్ షాట్ అయి ఉండేదని, చాలా మద్ధతు లభించేందని ముష్ఫికర్ తన మనసులో మాట బయటపెట్టాడు.

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యాఖ్యలను తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశాడు. బిగ్ షాట్ ఆడి మ్యాచ్ ను ముగించాలి. అయితే ఆ సమయంలో చేతిలో వికెట్లు ఉన్నాయా, లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఆ బ్యాట్స్ మన్ ఒకవేళ ఔటయిన తర్వాత వచ్చే ఆటగాడు మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావిస్తేనే షాట్ ఆడేందుకు ప్రయత్నించాలి' అని గతంలో ధోనీ కామెంట్లను షేర్ చేశాడు. అయితే తాను ఔటైన తర్వాత తన సహచరుడు కూడా అదే తీరుగా ఆడటం కూడా ఓటమికి మరింత కారణంగా మారిందని ముష్ఫికర్ రహీం వివరణ ఇచ్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  India  Mushfiqur Rahim T20 world cup 2016  

Other Articles