India vs Bangladesh: Every game is a knockout game, says Ashish Nehra

No social media for me i am still with my nokia says nehra

world t20, world t20 updates, India, ind vs pak, world t20 news, world t20 scores, ms dhoni, t20 world cup-2016, India, India vs bangladesh, Ashish nehra, bangladesh Cricket Board, bangladesh, ICC T20 WC, yuvvraj, kohli, rohit sharma, cricket news, cricket

India face Bangladesh in Bangalore tomorrow and while Ashish Nehra said the team was aware of the net run rate requirements, he insisted that the team was more focused on winning the crunch ICC World Twenyy20 game.

నెట్ రన్ రేట్ కాదు.. బంగ్లాపై గెలుపే ముఖ్యం

Posted: 03/22/2016 08:20 PM IST
No social media for me i am still with my nokia says nehra

టీమిండియా వెటరన్ ఆటగాడు అశిష్ నెహ్రా పిడుగులాంటి వార్త చెప్పాడు. చిన్నస్వామి స్టేడియంలో నెహ్రా మీడియాతో మాట్లాడాడు. తాను సోషల్ మీడియాలో లేనని, తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రమ్ లలో ఖాతాలు కూడా లేవన్నాడు. తాను ఇప్పటికీ పాత నోకియా మొబైల్ వాడుతున్నట్లు చెప్పగా.. ఆశ్చర్యపోవడం విలేకరుల పని అయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఏం జరుగుతుందన్న వాటితో తనకు సంబంధం లేదన్నాడు. తనకు ఏం తోచినా అదే విషయాన్ని నిర్మొహమాటంగా మీడియాతో, ఇతర కార్యక్రమాల్లో చెప్పడం నెహ్రాకు కొత్తేమీ కాదు.

ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముందురోజు భారత ఆటగాళ్ల ముఖాలు మార్ఫింగ్ వివాదం గురించి ఎలా స్పందిస్తారని నెహ్రాను విలేకరులు అడిగారు. అందుకు నెహ్రా స్పందిస్తూ.. మీరు రాంగ్ పర్సన్ ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో తనకు ఖాతాలు లేవని వివరించాడు. ఇంకా చెప్పాలంటే న్యూస్ పేపర్స్ కూడా చదవనని నెహ్రా చెప్పాడు. అయితే బంగ్లా జట్టు మాత్రం ఈ ఫార్మాట్లో రాణిస్తుందని పేర్కొన్నాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ ఈ 22న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బంగ్లా జట్టుతో తలపడుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup-2016  India  India vs bangladesh  Ahish nehra  Bangladesh Cricket Board  

Other Articles