వరల్డ్ టీ 20లో భాగంగా టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న టీమిండియా పేసర్ మొహ్మద్ షమీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దాదాపు ఏడాది కాలంగా గాయాలతో సతమవుతున్న షమీ..గురువారం వెస్టిండీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాల్గొని ఆకట్టుకోవడం నిజంగానే భారత జట్టుకు శుభసూచకమన్నాడు. టీమిండియా జట్టులో మొహ్మద్ షమీ ఒక కీలక బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కచ్చితమైన ప్రణాళికలను అమలు చేయడంలో షమీ దిట్ట అని రోహిత్ కొనియాడాడు.
'మేము ఏదైతే ఆశిస్తామో దాన్ని షమీ నెరవేరుస్తూ ఉంటాడు. అటు బౌన్సర్లు, యార్కర్ల దగ్గర్నుంచి, స్లో బంతులను కూడా సమర్ధవంతంగా సంధిస్తాడు. టీమిండియా తరపున షమీ చివరిసారిగా ఆడేసరికి అతను మా ప్రధానబౌలర్లలో ఒకడు. తొడ కండరాల గాయం నుంచి ఒక పేస్ బౌలర్ అంత తొందరగా కోలుకోవడం సులువు కాదు. అతని కష్టించే తత్వంతోనే వెస్టిండీస్ మ్యాచ్ లో షమీ ఆకట్టుకున్నాడు' అన్నాడు. వెస్టిండీస్ జరిగిన వార్మమ్ మ్యాచ్‌లో షమీ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. మోకాలి శస్త్రచికిత్సతో ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న షమీ ఫిట్ నెస్ ను పరీక్షించే క్రమంలో అతన్ని విండీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడించారు. ఆ మ్యాచ్ లో షమీ ఫర్వాలేదనిపించడంతో అతని స్థానంపై భరోసా ఏర్పడింది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more