Difficult to bring in Shami in place of Nehra or Bumrah: MS Dhoni

Ms dhoni hints there is no place for mohammed shami in playing xi

world t20, world t20 updates, world t20 news, world t20 scores, ms dhoni, ms dhoni captain, ms dhoni india, mohammad shami, shami bowling, sports news, sports, cricket news, cricket

MS Dhoni feels that Mohammad Shami will have to prove his fitness first in the two warm-up games of ICC World T20.

తుది జట్టులోకి ఆ బౌలర్ పునరాగమనం కష్టమే: ధోనీ

Posted: 03/08/2016 12:35 PM IST
Ms dhoni hints there is no place for mohammed shami in playing xi

టీ-20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా బెంగాల్ స్పీడ్‌స్టర్‌ మహమ్మద్ షమీకి టీమిండియా తుది జట్టులో చోటు లభించడం కష్టమేననిపిస్తోంది. ప్రస్తుతం జట్టు సమతుల్యంగా వుందని, దీంతో ఎవరినీ జట్టులోంచి తొలగించే అవకాశాలు కనబడటం లేదు, దీంతో షమీకి టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టులో స్థానం లభించడం మృగ్యంగానే వుంది. గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగిన షమీ.. ఫిట్ నెన్ నిరూపించుకోవాల్సి కూడా వుంది.

స్పీడ్ స్టర్ షమీ పునరాగమనంపై టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మీడియాతో మాట్లాడుతూ.. జట్టులోకి షమీ పునరాగమనం అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. షమీ ఒకవేళ ఫిట్‌నెస్ నిరూపించకున్నా.. మళ్లీ టీమ్‌లోకి తీసుకోవడం కష్టమని, ప్రస్తుతం చక్కగా రాణిస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా, ఆశిష్ నెహ్రాల్లో ఎవరి స్థానంలోనూ అతన్ని జట్టులోకి తీసుకోలేమని స్పష్టం చేశాడు. ప్రసుతం జట్టు మంచి సమతుల్యంతో ఉందని, కాబట్టి జట్టు కూర్పులో మార్పులు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

'షమీ ఫిట్‌గా ఉన్నాడా లేదా అన్నది ఇంకా మాకు తెలియదు. అతనికి మరింత సమయం అవసరమవుతుందని భావిస్తున్నాను. షమీ కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా అద్భుతంగా యార్కర్లు సంధించగలడు. కానీ బూమ్రా స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకోలేం. ఎందుకంటే బుమ్రా కొత్తబంతిగా బాగా రాణిస్తున్నాడు' అని ధోనీ చెప్పాడు. 'హర్దిక్ పాండ్యా మంచి ఆల్‌ రౌండర్‌. జడ్డేజా లేదా అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలరు. మూడు- నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలరు. ఇక మిగిలింది ఆశిష్ నెహ్రా. అతని స్థానంలో షమీని తీసుకోవడం కష్టం. ఎందుకంటే నెహ్రా ఇటీవల జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. బంతికి అనుగుణంగా బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు' అని ధోనీ స్పష్టం చేశాడు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  ashish nehra  cricket  jasprit bumrah  mohammed shami  ms dhoni  

Other Articles