India conforms berth in asia cup final, by defeating srilanka

Pandya bruises yuvraj cruises in asia cup against sri lanka

Asia Cup 2016, Cricket, Dhaka, India, Live Scores, Live Updates, MS Dhoni, Pakistan, Rohit Sharma, Virat Kohli, ICC World Twenty20, Sri lanka, India, bcci, india vs srilanka, ind vs sl icc t20, 2016 t20 world cup, t20 world cup 2016, world t20, cricket, cricket news

India marks 5-wicket win over Sri Lanka. India enterd the Final of the Asia Cup T20. India are unbeaten in the tournament so far.

హ్యాట్రిక్ విజయంతో అసియా కప్ ఫైనల్ లోకి టీమిండియా..

Posted: 03/02/2016 05:49 PM IST
Pandya bruises yuvraj cruises in asia cup against sri lanka

ఆసియాకప్‌లో ఓటమిని ఎగురకుండా దూసుకుపోతున్న టీమిండియా తన జోరు కొనసాగిస్తుంది. హ్యట్రిక్ విజయంతో దూసుకెళ్తున్న ధోని సేన ఏకంగా అసియా కప్ ఫైనల్ లో తమ బర్త్ ను కన్ఫాప్ చేసుకున్నారు. మొత్తంగా ఐదు జట్లు ఆసియాకప్ లో ఆడుతుండగా,  మూడు ప్రధాన జట్లు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో ఆడి విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా ఇక పసికూన యూఏఈ తో మ్యాచ్ మిగిలిండగానే ఫైనల్ భర్త్ ఖాయం చేసుకుంది.

లీగ్ దశలో నిన్న జరిగిన మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై ఐదు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని భారత మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మూడో మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లు అనిపించింది. ఆయన తనదైన శైలిలో సిక్సర్లను, భారీ షాట్ లను కొట్టారు. ఇక డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌, ఛేజింగ్‌ కింగ్‌ కోహ్లీ 56రన్లతో కెప్టెన్ ధోనితో కలసి టీమిండియాను విజయ తీరాలకు చేరవేశాడు.

అంతకుముందు టాస్‌ నెగ్గిన ధోనీ.. ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. పేసర్‌ ఆశీష్‌ నెహ్రా తన రెండో ఓవర్లోనే ఓపెనర్‌ దినేశ్‌ చాందిమల్‌ను అవుట్‌ చేయగా, తర్వాతి ఓవర్లోనే బుమ్రా గుడ్‌ లెంగ్త్‌ బంతితో జయసూర్యను పెవిలియన్‌కు పంపాడు. ఇక రెండు ఫోర్లు కొట్టి జోరందుకున్న దిల్షాన్‌ను తన తొలి బంతికే పాండ్యా అవుట్‌ చేశాడు. కాసేపు పోరాడిన కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌నూ క్లీన్‌బౌల్డ్‌ చేసి లంకను కోలుకోలేని దె బ్బకొట్టాడు. ఈ దశలో కపుగెదెర, సిరివర్దనె జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే సిరివర్దనను అవుట్‌ చేసిన అశ్విన్‌ ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో షనక రనౌటయ్యాడు. ఇక బుమ్రా బౌలింగ్‌లో పాండ్యా పట్టిన మంచి క్యాచ్‌కు కపుగెదెర వెనుదిరిగాడు.  కాగా టెయిల్ ఎండర్లు తీసరా పెరీర వేగంగా ఆడి లంక స్కోరుబోర్డును పరుగెత్తించి గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asia cup t-20 2016  India  Srilanka  T20  Dhoni  virar kohli  Yuvraj  

Other Articles