I have promised my sons a ferrari if they break my 319 at any level virender sehwag

Break my 319 at any level take ferrari sehwag with his kids

cricket, cricket news, india vs south africa 2015, virender sehwag, virender sehwag felicitation, virender sehwag sons

Virender Sehwag, best news for his two sons was they have a Ferrari to play for and break their father's highest Test score of 319.

నా రికార్డును బద్దలు కొట్టండి ఫెరారీ తీసుకోండి

Posted: 12/03/2015 06:56 PM IST
Break my 319 at any level take ferrari sehwag with his kids

టీమిండియా తరపున టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేసిన ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. 2008 లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 319 పరుగులు చేసిన సెహ్వాగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, భారత తరపున టెస్టుల్లో సెకెండ్ బెస్ట్(309 పరుగులు ), థర్డ్ బెస్ట్(293 పరుగులు) కూడా సెహ్వాగ్ పేరిటే ఉండటం మరో విశేషం. అయితే తాను టెస్టుల్లో నమోదు చేసిన 319 పరుగుల రికార్డును తన కుమారులు ఏ స్థాయిలోనైనా అధిగమిస్తే వారికి ఫెరారీ కారు బహుమతిగా ఇస్తానని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న చివరిదైన టెస్టు మ్యాచ్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారులకు ఓ మంచి బంపర్ ఆపర్ ను ప్రకటించాడు. ఏ తండ్రైనా తన కుమారులు చదవులో రాణించాలని.. వారికి చిన్న చిన్న ఆశలు కల్పిస్తారు. కనీసం వాటికోసమైనా వారు చదువులో రాణిస్తారని తల్లిదండ్రుల నమ్మకం. అలానే ఒక క్రికెటర్ గా తన కుమారులు కూడా తన మాదిరిగా క్రికెట్ లో ఱానించాలని మన క్రికెటర్లు ఆశపడటంలో తప్పులేదు. అలాంటిదే ప్రస్తుతం జరిగింది. తన ఇద్దరు కుమారులలో ఎవరైనా తన అత్యధిక స్కోరును ఏ స్థాయిలోనైనా బద్దలు కోడితే వారికి ఫెరారీ కారును బహుమానంగా అందిస్తానని సెహ్వాగ్ ప్రకటించారు.

ఇలీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సేహ్వాగ్.ను ఇవాళ ఢిల్లీ ఫెరోజ్ షా స్టేడియంలో బిసిసిఐ సన్మానించింది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే సెహ్వాగ్ కు సమాచారం అందించడంతో ఆయన తన కుటుంబసమేతంగా వచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అయనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఘనంగా సన్మానించింది. అనంతరం సెహ్వాగ్ తన కుటుంబంతో కలిసి మ్యాచ్ ను వీక్షించాడు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ తో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ముచ్చటించాడు. 'ఆ రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉంది. 319 పరుగుల రికార్డును నా కుమారులు ఏ స్థాయిలో బద్ధలు కొట్టినా వారికి ఫెరారీ కారు కానుకగా ఇస్తా' అని సెహ్వాగ్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  sons  South africa  India  

Other Articles