South Africa struggling at end of 20-wicket day

India tighten screws on spin wary south africa in third test

Nagpur test, iindia vs south africa, ind vs sa, india south africa, ind vs sa 3rd test, india cricket, cricket india, south africa cricket, south africa vs india, sa vs ind, cricket score, cricket news, cricket, Murali Vijay, M Morkel, S Harmer, ravichandran ashwin, ravindra jadeja, amit mishra, Tahir

India seized control of the third Test in Nagpur on Thursday as South Africa — shot out for a record low score of 79 — fumbled again in their chase of a tough target.

టెస్టు సిరీస్ విజయం అంచులకు చేరుకున్న టీమిండియా..

Posted: 11/27/2015 07:55 AM IST
India tighten screws on spin wary south africa in third test

దక్షిణాప్రికాతో నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో రెండో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో.. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో గెలుపు దిశగా అడుగులు వేస్తున్న టీమిండియా.. అటు టెస్టు సిరీస్ విజయం అంచులకు చేరుకుంది. నాగ్ పూర్ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజున ఇరు వైపులా స్పిన్నర్ల హవా కొనసాగింది. సఫారీలను 79 పరుగలుకు ఆల్ అవుట్ చేసిన కోహ్లీ సేన.. అదే స్పిన్ కు రెండో ఇన్నింగ్స్ ను చాపచుట్టేశారు. ఆ తరువాత సఫారీలు రెండో ఇన్నింగ్ ను ప్రారంభించగా, రెండు వికెట్లు నష్టంతో 32 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా కొనసాగుతోంది. మూడో టెస్టు మూడో రోజున సఫారీలు ఎలా రాణిస్తారన్న ఉత్కంఠ కోనసాగుతోంది. కాగా టీమిండియా దక్షిణాఫ్రికా ముందుంచిన 310 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించగలరా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

రెండో రోజు 310 పరుగుల విజయలక్ష్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ వాన్ జిల్ (5) ను అశ్విన్ బోల్తా కొట్టించగా, నైట్ వాచ్ మెన్ ఇమ్రాన్ తాహీర్(8) ను అమిత్ మిశ్రా పెవిలియన్ కు పంపాడు. దీంతో గురువారం ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అంతకుముందు రెండో రోజు ఆటలో భాగంగా గురువారం సెకెండ్ ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా 46.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది.

టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(5) ఆదిలో పెవిలియన్ కు చేరినా.. శిఖర్ ధవన్(39), చటేశ్వర పూజారా(31)లు రాణించారు. అనంతరం విరాట్ కోహ్లి(16), రహానే(9)లు నిరాశ పరిచారు. ఆపై రోహిత్ శర్మ(23), అమిత్ మిశ్రా(14) ఫర్వాలేదనిపించడంతో టీమిండియా 173 పరుగులకే రొండో ఇన్నింగ్స్ లో అలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ ఐదు వికెట్లు తీయగా,మోర్నీ మోర్కెల్ మూడు, హార్మర్ కు ఒక వికెట్ దక్కింది.

రెండో రోజు భారత స్పిన్నర్ల ధాటికి సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే మొత్తం వికెట్లు కోల్పోయారు. పదకొండు పరుగులకు రెండు వికెట్లు ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సఫారీలు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 79 పరుగులకే అలౌట్ అయ్యారు.. కేవలం 68 పరుగుల జోడించి మిగతా 8 వికెట్లను సఫారీలు చేజార్చుకున్నారు. 35 పరుగులతో డుమిని టాప్ స్కోరర్ గా నిలువగా, హ్మర్ 13, డూస్లెసిస్ 10 పరుగులు చేశారు. వివిలియర్స్, వాన్ జిల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యి వెనుదిరిగారు. భారత స్పిన్నర్ రవిచంద్రబన్ అశ్విన్ మరో మారు ఐదు విక్కెట్లను పడగొ్టాడు. జడేజా 4 వికెట్లు, అమిత్ మిశ్రా ఒక్క వికెట్ పడగొట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  nagpur test  south africa  cricket  

Other Articles