australia pacer mitchell johnson retires from international cricket

Australia pace bowler johnson to retire after nz test

Australia pace bowler Johnson, Johnson retires, Johnson retires New Zealand test, Australia's Mitchell Johnson, Mitchell Johnson most devastating fast bowler, Mitchell Johnson international cricket

Australia's Mitchell Johnson, who was the most devastating fast bowler of his era when in form, will retire from all international cricket at the conclusion of the second test against New Zealand later on Tuesday.

అంతర్జాతీయ క్రికెట్కు జాన్సన్ గుడ్ బై

Posted: 11/17/2015 06:27 PM IST
Australia pace bowler johnson to retire after nz test

ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. ఇవాళ న్యూజీలాండ్ తో జరిగిన రెండో టెస్టు ముగిసిన అనంతరం ఆయన తాను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల పెర్త్ టెస్టే జాన్సన్కు ఆఖరి మ్యాచ్ గా నిలిచింది. అసీస్ బౌలర్ల జాబితాలో అత్యంత విధ్వంసకర బౌలర్ గా జాన్సన్ పేరు సంపాదించాడు.

ఆయన ఫామ్ లో వుండగా, ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ విక్కెట్లను సాధిస్తూ తన కెరీర్ లో బెస్ట్ ఫిగర్లను సాధించాడు. టెస్టుల్లో అత్యిధిక వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా క్రికెటర్గా జాన్సన్ ఘనత సాధించాడు. టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు.  153 వన్డేలాడి 239 వికెట్లు తీశాడు. కాగా, రిటైర్మెంట్ ప్రకటించిన జాన్సన్‌కు సచిన్ టెండూల్కర్ తన శుభాభినందనలు తెలిపాడు. అతడు ఎప్పుడూ చాలా స్పెషల్ బౌలర్ అని ప్రశంసించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia cricket  Mitchell Johnson  retirerment  international cricket  

Other Articles