Younis Khan announces ODI retirement

Younis khan announces odi retirement

Younis Khan, Younis Khan retirement, Younis Khan ODI retirement, cricket, Pakistan, Younis Khan for Pakistan cricket, Younis Khan News, Younis Khan best matches

Younis Khan, Pakistan's veteran batsman, has decided to call time on his One-Day International (ODI) career. He will quit after the first ODI against England on Wednesday (November 11) at the Sheikh Zayed Stadium, Abu Dhabi.

వన్డే క్రికెట్‌ కు యూనిస్‌ ఖాన్ గుడ్‌ బై

Posted: 11/11/2015 05:25 PM IST
Younis khan announces odi retirement

వన్డే క్రికెట్‌ కు పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ యూనిస్‌ఖాన్ వీడ్కోలు పలికాడు. 2015 వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే జట్టులో చోటు కోల్పోయిన ఈ సీనియర్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లాండ్‌తో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నాలుగు వన్డేల సిరీస్ కోసం ప్రకటించిన పాక్ జట్టులో తిరిగి చోటు సంపాదించాడు. అయినా..గౌరవంగా రిటైర్ కావలనుకున్నాడో ఏమో గానీ అబుదాబి వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న డే అండ్ నైట్ మ్యాచ్‌తో తాను వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు 37 ఏళ్ల యూనిస్‌ఖాన్ ప్రకటించాడు. నవంబర్ 29, 1977లో పాకిస్థాన్‌లో జన్మించిన యూనిస్‌ఖాన్ తనకు 23 ఏళ్ల వయసున్నప్పుడు కరాచీ వేదికగా ఫిబ్రవరి, 2000లో శ్రీలంకతో జరిగిన వన్డేతో తన కెరీర్‌ను ఆరంభించాడు.

కెరీర్ ప్రారంభించిన తర్వాత అప్పుడప్పుడు సెలెక్టర్ల వేటుకు గురైనా చాలా కాలం పాకిస్థాన్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో మరీ దూకుడుగా ఆడకపోయినప్పటికీ పాక్ బ్యాటింగ్‌ ఆర్డర్లో నమ్మదగ్గ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. మొత్తంగా 264 వన్డేలు ఆడిన ఈ సీనియర్ ఆటగాడు 7240 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 48 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 144 పరుగులు చేశాడు. వన్డేల్లో పెద్దగా పేరు సంపాదించలేకపోయిన యూనిస్‌ఖాన్ టెస్టుల్లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌ పై మరింత దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles