Bowlers, MS Dhoni shine as India beat South Africa by 22 runs

Dhoni stars in india s 22 run win over south africa

challenging to maintain momentum, one day international, ravichandran ashwin, virat kohli, india vs south africa, washed out | Virat Kohli | Rohit Sharma | Ravichandran Ashwin | Kolkata | Hashim Amla, AB De Villiers, captain, India, south africa, team india, MS Dhoni, cricket news

Under-fire Mahendra Singh Dhoni marked his return to form with an unbeaten 92 as India recorded a 22-run victory over South Africa in the second cricket One-dayer to level the five-match series 1-1 in Indore on Wednesday

ఇండోర్ సెంటిమెంటే గెలిచింది.. సమిష్టిగా రాణించిన టీమిండియా

Posted: 10/14/2015 10:02 PM IST
Dhoni stars in india s 22 run win over south africa

ఒకే ఒక్క విజయం కోసం అత్రుతగా ఎదురుచూస్తున్న టీమిండియా క్రికెట్ జట్టుకు ఆ అవకాశం అందివచ్చింది. బలమైన సెంటిమెంట్ వున్న ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో విజయాన్ని అందుకుని రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తుంది. ఇండోర్ స్టేడియం సెంటిమెంట్ మళ్లీ గెలిచింది. టీమిండియా జట్టు కెప్టెన్ ధోని కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించగా, విజయం కోసం ఎదురుచూస్తున్న టీమిండియా గెలుపును అస్వాధించింది. బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోయినా.. స్వల్ప స్కోరును బోర్డుపై పెట్టిన టీమిండియా సమిష్టి కృషితో విజయాన్ని అందుకుంది.

ఇండోర్ వన్డేలో 248 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని అందుకోకుండానే ఓడిపోయింది. మరో ఆరు ఓవర్ల రెండు బంతులు మిగిలివుండగానే.. 43.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను ఆరంబించగానే ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఒక ధశలో రెండో వన్డేను కూడా తమ ఖాతాలో వేసుకుంటారేమోనన్న అందోళన భారత అభిమానుల్లో కనిపించింది. క్రమంగా విక్కెట్లు తీయడంతో డుప్లెసిస్, డివిలర్స్ ఔటవ్వడంతోనే ఇక మ్యాచ్ పై అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఇండోర్ సెంటిమెంట్ కూడా నిలిచింది. భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ చెరి మూడు వికెట్లు సాధించారు. 22 పరుగులతేడాతో గెలుపొందిన భారత్ 1-1తో సిరీస్ సమం చేసింది.

అంతకుముందు భారత్ సౌతాఫ్రికా ముందు 248 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. కెప్టెన్ ధోనీ చేసిన 92 పరుగులే అత్యధిక స్కోరు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోరుకే అవుటయ్యారు. రోహిత్ శర్మ మూడు పరుగులకే పెవీలియన్ దారి పట్టాడు. శిఖర్ ధావన్ 23, కోహ్లీ 12, అక్షర్ పటేల్ 13, హర్భజన్ సింగ్ 22, రహానే 51 పరుగులు చేశారు. ధోనీ 86 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 92 పరుగులు చేశాడు.

అజింకా రహానే-51, శిఖర్ ధావన్-23, హర్భజన్‌సింగ్-22, భువనేశ్వర్ కుమార్-14, అక్షర్ పటేల్-13, విరాట్ కోహ్లీ-12, యాదవ్-4, రోహిత్ శర్మ-3, రైనా-0 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా ధోనీ-92 పరుగులు, మోహిత్‌శర్మ-0 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో స్టెయిన్-3, తాహీర్-2, మోర్కెల్-2, రబడ-1 వికెట్‌ను పడగొట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  south africa  team india  MS Dhoni  cricket news  

Other Articles