Once we start winning we will be a difficult side to beat, says Harbhajan Singh

We want to play our best game in 3rd t20i harbhajan singh

harbhajan singh, harbhajan singh india, india harbhajan singh harbhajan india, eam india, south africa, south africa tour of india 2015, kolkata, eden gardens, india south africa, south africa india, ind vs sa, sa vs ind, cricket news, cricket

They might have lost the T20I cricket series to South Africa but Indian ace spinner Harbhajan Singh today said it's too early to write them off as the hosts are keen to turn around their fortunes in the last and final match here tomorrow.

విజయాన్ని అందుకుంటే.. ప్రత్యర్థులకు కష్టాలే..

Posted: 10/07/2015 06:56 PM IST
We want to play our best game in 3rd t20i harbhajan singh

టీమిండియా టీ-20 సిరీస్ ను దక్షిణాఫ్రికాకు చేజార్చుకున్న అంశంపై స్పందించిన భారత స్పిన్ మాంత్రికుడు హర్బజన్ సింగ్.. అతిధ్య జట్టును తక్కువగా అంచనా వేయడం కూడా సముచితం కాదని అన్నాడు. ఒక్కసారి విజయాన్ని అస్వాదిస్తే.. భారత్ ఎంత కఠినమైన జట్టో.. ప్రత్యర్థులకు ఇట్టే అర్థమవుతుందని అన్నారు. టీమిండియా.. టీ-20 సిరీస్ ను దక్షిణాఫ్రికాకు క్లీన్ స్వీస్ ఇస్తుందన్న వార్తలను ఆయన తోసిపుచ్చాడు. రేపు కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఆఖరు టీ-20 మ్యాచ్ లో టీమిండియా తన అదృష్టాన్ని తిరగరాసుకుంటుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

తాము సిరీస్ ను కోల్పోయామని, అయితే చివరి మ్యాచ్ లో తాము ఇంకా చాలా ఆడాల్సిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాము ఈ మ్యాచ్ ను గెలుస్తామని, ఇక అక్కడి నుంచి టీమిండియా కథ వేరుగా వుంటుందని అన్నారు. టీ-20 తరువాత వన్డేలు, ఆ తరువాత టెస్టు మ్యాచ్ లు వున్న నేపథ్యంలో అన్ని సిరీస్ లు ముఖ్యమేనని అన్నారు. వాటిల్లో కూడా తాము అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయాన్ని సొంతం చేసుకుంటామని చెప్పారు. ఇందుకు శ్రీలంకతో ఇటీవల జరిగిన సిరీస్ ను ఆయన ఊటంకిస్తూ.. తొలి టెస్టు ఓడిన తరువాత.. విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా.. ఇక వెనుదిరిగి చూడలేదన్నాడు. అదే తమ విశ్వాసమని, తాము రాణిస్తామని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  harbhajan singh  south africa tour of india 2015  kolkata  eden gardens  

Other Articles