Ajinkya Rahane donates Rs 5 lakh to CM's relief fund for farmers

Ajinkya rahane donates rs 5 lakh for drought hit farmers

there's, a, heartwarming, reason, behind, cricketer, ajinkya, rahane's, donation, to, drought-struck, farmers, india, cricket, ajinkya rahane, latest cricket news, cricketer, Ajinkya Rahane, Rs 5 lakh, CM Drought Relief Fund, farmers, Maharashtra.

aking a cue from actor Nana Patekar, batsman Ajinkya Rahane has donated Rs 5 lakh to the Chief Minister Drought Relief Fund to help struggling farmers in Maharashtra.

రైతల కోసం రహానే ఐదు లక్షల విరాళం..

Posted: 09/15/2015 04:25 PM IST
Ajinkya rahane donates rs 5 lakh for drought hit farmers

భారత క్రికెటర్ అజింక్య రహానే రైతులను ఆదుకునే విషయంలో పెద్ద మనసును ప్రదర్శించాడు. సినీనటుడు నానా పటేకర్ తరువాత మహారాష్ట్రలోని కరువు పీడత ప్రాంతాల రైతంగాన్ని అదుకునేందుకు తన వంతు కర్తవ్యంగా ముందుకు వచ్చాడు అజింక్య రహానే. మహారాష్ట్రలో కరవు బారిన పడిన రైతుల సంక్షేమ నిధికి తన వంతుగా రూ. 5 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను సోమవారం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేశాడు. తరచుగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ రాష్ట్రంలో సమస్యపై స్పందించిన తొలి క్రికెటర్ రహానే కావడం గమనార్హం.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజింక్య రహానే.. తన అమ్మమ్మ ఇచ్చిన స్పూర్తితోనే తాను రైతులకు విరాళం ఇచ్చినట్లు చెప్పుకోచ్చారు. తన అమ్మమ్మకు 92 ఏళ్ల వయస్సని అయితే అమె ఇప్పటికీ పోలానికి వెళ్లి కష్టపడుతుందని అది అమె నైజమని చెప్పారు. ఈ వయస్సులో కూడా అమె ఊరికే కూర్చోడానికి ఇష్టపడదని చెప్పారు. అమె కష్టం నాకు స్పూర్తినిచ్చిందని చెప్పాడు. అమెతో పాటు తన మామయ్య కూడా ఇప్పటికీ పోలానికి వెళ్లి  పగలంతా కష్టపడతారని చెప్పాడు. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను రైతులు కష్టకాలంలో వున్నప్పుడు తనవంతుగా ఏదో చేయాలని భావించి.. ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చినట్లు చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer  Ajinkya Rahane  Rs 5 lakh  CM Drought Relief Fund  farmers  Maharashtra.  

Other Articles