Ishant Sharma War Of Words With SriLanka Player Herath During Match | Cricket Incidents

Ishant sharma war of words with srilanka players

ishant sharma, cricketer herath, ishant herath fight, india cricket team, sri lanka cricket team, ishant herath war of words, sri lanka india tour

Ishant Sharma War Of Words With SriLanka Players : Ishant Sharma War Of Words With SriLanka Player Herath During Match.

‘లంబూ’దరుడి మాటల దూకుడు!

Posted: 08/31/2015 01:00 PM IST
Ishant sharma war of words with srilanka players

ఇండియా క్రికెట్ జట్టులో ‘లంబూ’దరుడిగా పేరొందిన ఇషాంత్ శర్మ.. శ్రీలంక టూర్ లో అద్భుతంగా తన ప్రతిభను కనబరుస్తున్నాడు. రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ తన బౌలింగ్ స్టైల్ తో లంక బ్యాట్స్ మెన్లను భరతం పట్టించాడు. అయితే.. ఓ సందర్భంలో తన చేతితో పనిచెప్పడమే కాకుండా నోటికి కూడా పనిచెప్పాడు. తన మాటల దూకుడుని మరింత పెంచేశాడు. రెండో మ్యాచులో ఓ క్రికెట్ పై ఇతగాడు నోరు పారేసుకున్నందుకు జరిమానాకు గురయ్యాడు కూడా! అయినప్పటికీ తన తీరును ఏమాత్రం మార్చుకోకుండా.. మూడో టెస్ట్ మ్యాచులోనూ ఓ లంక క్రికెటర్ పై ఈ ‘లంబూ’దరుడు నోరు పారేసుకున్నాడు.

ఇషాంత్ బౌలింగ్ లో లంక వికెట్లు టపీటపీమని పడిపోతుండగా.. ఒక్క ఆటగాడైన హెరాత్‌ మాత్రం అతని బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో వున్నాడు. అతనిని ఎలాగైనా ఔట్ చేయాలన్న ఉద్దేశంతో ఇషాంత్ ప్రయత్నాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే 32వ ఓవర్లో లంబూ విసిరిన షార్ట్‌లెంగ్త్‌ బంతిని హెరాత్‌ తప్పించుకున్నాడు. దీంతో ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. ఆపై ఇద్దరూ తిట్టుకోవడంతో అంపైర్లు, కోహ్లీ రంగంలోకి దిగి వారిని విడదీశారు. ఇక తన తర్వాతి ఓవర్లోనే కుశాల్‌ పెరీరను అవుట్‌ చేసిన ఇషాంత్‌.. అతను మైదానం వీడుతున్నప్పుడు మళ్లీ నోరు జారాడు. ఈ ఘటనపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ఇషాంత్‌.. ‘అతను నాకు మంచి మిత్రుడే. నాతో డిన్నర్‌కు ఎప్పుడు వస్తావని అడిగానంతే’ అని చెప్పుకొచ్చాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ishant sharma  sri lanka cricket team  

Other Articles