India vs Sri Lanka 2015: Shikhar Dhawan Ruled Out of Test Series Due to Hairline Fracture

Setback to india as injured dhawan ruled out of remaining tests versus sri lanka

Cricket, India vs Sri Lanka, Shikhar Dhawan, Sri Lanka, India vs Sri Lanka, India, India in Sri Lanka 2015, Sports, Sri Lanka, Virat Kohli, Ravichandran ashwin, amit mishra, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, cricket news

India suffered a huge blow after their in-form opener Shikhar Dhawan was Monday ruled out of the remainder of the cricket Test series against Sri Lanka due to a hairline fracture in his hand.

గాయం కారణంగా రెండో టెస్టుకు ధావన్ దూరం

Posted: 08/17/2015 07:22 PM IST
Setback to india as injured dhawan ruled out of remaining tests versus sri lanka

టీమిండియా సేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అసలే సీనియర్ బాట్స్ మెన్లు లేక జట్టు స్వల్ప స్కోరును సాధించడానికి అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ చేతికి గాయం కావడం, ఆయన రెండో టెస్టుకు అందుబాటులో ఉండకపోవడంతో టీమిండియా అభిమానుల్లో కలవరం మొదలైంది. శ్రీలంకతో మొదటి టెస్టులో మూడు రోజులు ఆధిపత్యం వహించి.. నాలుగో రోజు ఒక్క సెషన్‌లో చెత్త బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను అప్పగించేసింది భారత జట్టు.

తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు అధిపత్యం దిశగా పయనించడానికి కారణం శిఖర్ ధావనే. ఆయన సాధించిన శతకానికి జత కలిసిన విరాట్ కోహ్లీ శతకం జట్టును అధిక్యం దిశగా పయనింపజేసింది. అదే రెండో ఇన్నింగ్స్ లో ధావన్ స్వల్ప స్కోరుకు ఔటవ్వడంతో జట్టులోని అందరు బ్యాట్స్ మెన్లు వరస క్రమంలో పెవిలీయన్ కు చేరుకున్నారు. దీంతో రెండో టెస్టుకు ధావన్ అందుబాటులో ఉండకపోవచ్చునన్న వార్తలతో అభిమానులు కలవరానికి గురవుతున్నారు. ధావన్ స్థానంలో ఎవరినీ తీసుకుంటారు..? టీమిండియాకు కలిసోచ్చేవారేనా అంటూ అప్పుడే అరా తీస్తున్నారు అభిమానులు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  India vs Sri Lanka  Shikhar Dhawan  Sri Lanka  

Other Articles