Michael Clarke Clashes News Fot Their Defeat That Wifes Lovers Reasons For Team Defeat

Michael clarke fires for coming news wifes lovers reasons for team defeat

Michael Clarke, ashes series, Michael Clarke news, Michael Clarke press meet, Michael Clarke udates, australia cricket team, england cricket team, english man

Michael Clarke Fires For Coming News Wifes Lovers Reasons For Team Defeat : Michael Clarke Clashes News Fot Their Defeat That Wifes Lovers Reasons For Team Defeat

భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ ని లాగొద్దు..

Posted: 08/10/2015 11:49 AM IST
Michael clarke fires for coming news wifes lovers reasons for team defeat

యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచుల టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ జట్టు అంత ఘోరంగా విఫలమవడానికి గల కారణాలను ఎత్తిచూపుతూ క్రీడాభిమానుల నుంచి మాజీలు, విశ్లేషకులు మండిపడుతున్నారు. జట్టులో సమిష్టితత్వం లోపించడం ఓ కారణమైతే.. ఆటగాళ్లు తమతోపాటు భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకెళ్లడం మరో ప్రధాన కారణమని తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా.. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ భార్యలను విదేశీ టూర్లకు తీసుకెళ్లి.. జట్టుతో కాకుండా వేరుగా వుండటమే ఓటమికి కారణమని ఓ డైలీ పేర్కొంది.

ఇలా ఈ విధంగా వార్తలు వస్తుండటంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఓటమికి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ ను వెంట తీసుకెళ్లడం కారణమని వస్తున్న వార్తల్ని ఖండించాడు. అసలు అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు. పైగా.. తాను చేసిన 10 టెస్టు సెంచరీలు భార్యను వెంట తీసుకెళ్లి చేసినవేనంటూ కౌంటరిచ్చాడు. తాను జట్టుతో ఉండకుండా ఆఫ్ ఫీల్డ్ రిలేషన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొనడం తగదన్నాడు. ‘ప్రతీరోజు ఆట ముగిసిన తరువాత ఎలా ఆడాం? ఎలా ఆడాలి?అనే దానిపై జట్టు సభ్యులు అంతా కలిసి చర్చించుకుంటామ’ని క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రతిఒక్క ఆటగాడు తన జట్టు కోసమే క్రికెట్ ఆడతాడని, గెలుపుకోసం ఎంతో శ్రమిస్తాడని, వ్యక్తిగత సమస్యలు ఎన్ని వున్నప్పటికీ, అవన్ని మరిచి గెలుపే ధ్యేయంగా మైదానంలో అడుగుపెడతాడని క్లార్క్ అన్నాడు.

ఇదిలావుండగా.. యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలై.. సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది. ఈ విధంగా ఘోరంగా పరాజయం కావడంతో నిరాశకు గురైన క్లార్క్ .. తన టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. తాను యాషెస్ లో ఐదో టెస్ట్ అనంతరం టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Michael Clarke  England Cricket Team  Australia  

Other Articles