Ishant claims five as Indians extend lead in warm-up game

Indian bowlers shine against srilanka 3 days match

Ishant claims five as Indians extend lead in warm-up game, indian bowlers shine against srilanka, ishant sharma, ishant sharma india, india ishant sharma, ishant india, india board president xi, india warm up match, india warm up, india practice match, virat kohli, cricket news, cricket

Ishant Sharma took 5-23 in a sensational spell of fast bowling to rout Sri Lanka Board President’s XI batting line-up as Indian bowled them out for a paltry 121 in their first innings on day two of the three-day warm-up match in Colombo.

బోర్డు ఎలెవన్ మ్యాచ్ లో మెరిసిస భారత బౌలర్లు

Posted: 08/07/2015 07:33 PM IST
Indian bowlers shine against srilanka 3 days match

కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లూ  సత్తాచాటారు. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ లెవెన్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ ఓవరాల్గా 342 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను భారత బౌలర్లు 121 పరుగులకే కుప్పకూల్చారు. భారత పేసర్ ఇషాంత్ శర్మ (5/23) సూపర్ స్పెల్తో విజృంభించి.. లంక టాపార్డర్ పనిపట్టాడు. వరుణ్ ఆరోన్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.

లంక జట్టులో డిక్వెల్లా 41,సిరివర్ధన 32, గునతిలక 28 పరుగులు చేయగా, మిగిలినవారు సింగిల్ డిజిట్కు పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లకు 112 పరుగులు చేసింది. పుజారా (31 బ్యాటింగ్), రాహుల్ (47 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ (8), కోహ్లీ (18), సాహ (1) అవుటయ్యారు. ఓవర్నైట్ స్కోరు 314/6తో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 351 పరుగులకు ఆలౌటైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian bowlers  indian cricket  srilanka tour  ind vs srl  

Other Articles