Younis Khan Thanks Rahul Dravid for Progress as Test Batsman

Younis khan thanks indian great rahul dravid for his success

Pakistan,Rahul Dravid,Younus Khan,Cricket Younis Khan Thanks Rahul Dravid for Progress as Test Batsman latest Cricket news

Seasoned Pakistan batsman Younis Khan says Indian great Rahul Dravid played a huge role in his development as a top class Test batsman.

రాహుల్ పై గురుభక్తిని చాటుకున్న యూనిస్ ఖాన్

Posted: 08/07/2015 07:20 PM IST
Younis khan thanks indian great rahul dravid for his success

క్రీడాకారులకు అవధులు వుండవు. పరిధులు వుండవు.. తాము నేర్చుకోవాల్సింది ఏదైనా వుంటే.. తమకు నచ్చిన మేటి క్రీడాకారుడి నుంచి నేర్చుకుంటారు. అంతేకాదు దానిని సమయం సందర్భం వచ్చిన సమయంలో వెల్లడిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ తన గురుభక్తిని చాటుకున్నాడు. తనను అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దడంలో భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పాత్ర ఎంతో ఉందని పాక్‌ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ ఖాన్‌ చెప్పాడు.

మూడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా నిలుదొక్కుకున్నానంటే ఆ క్రెడిట్‌ అంతా రాహుల్ ద్రావిడ్‌దేనని అన్నాడు. కెరీర్‌ ఆరంభంలో రాహుల్‌ ఇచ్చిన సూచనలు, సలహాల వల్లే బ్యాటింగ్‌లో ఎంతో మెరుగయ్యానని తెలిపాడు. 2009లో కెప్టెన్‌గా రాజీనామా చేసి పెద్ద తప్పు చేశానని యూనిస్‌ అన్నాడు. జట్టును ఐక్యం చేయడంలో విఫలమయ్యానని భావించి రాజీనామా చేసినట్టు చెప్పాడు. మరోసారి కెప్టెన్సీ అవకాశం వస్తే జట్టు బాధ్యతలను మోసేందుకు.. తన నాయకత్వంలో విజయాలను నమోదు చేసేందుకు సిద్ధమని యూనిస్‌ ఖాన్‌  ప్రకటించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Rahul Dravid  Younus Khan  India  

Other Articles