Chanderpaul wants to hit 12,000 runs before retirement | West Indies | Shivnarine Chanderpaul | highest run scorer | 12000 runs club

Chanderpaul wants to hit 12 000 runs before retirement

West Indies, Shivnarine Chanderpaul, highest run scorer, 12000 runs club, Australia tour, England tour

Market experts expect the consolidation to continue ahead of outcome of Federal Reserve's two-day meeting (scheduled to begin today) and expiry of July derivative contract on Thursday.

12 వేల పరుగుల క్లబ్ లో చేరాలని వుంది..

Posted: 07/28/2015 07:22 PM IST
Chanderpaul wants to hit 12 000 runs before retirement

వెస్టీండీస్ బ్యాట్స్ మెన్ శివ నరేన్ చందర్ పాల్ కు తన మనస్సులో దాగి వున్న విషయాన్ని ఎట్టకేలకు బయటపెట్టాడు. తనకు 12 వేల పరుగుల క్లబ్ లో చేరాలని వుందని తెలిపాడు. అధి కూడా తాను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే ముందే ఈ పరుగులను సాధించాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పుకోచ్చాడు. పన్నెండు వేల పరుగులు క్లబ్ లో చేరిన తొలి వెస్టీండిస్ క్రికెటర్ గా నిలిచిపోవాలన్నదే తన ఆశయమని చెప్పుకోచ్చాడు. గత కొంత కాలంగా చందర్ పాల్ ను టెస్టు సిరీస్ ల నుంచి పక్కకు తప్పించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యోచిస్తున్న తరుణంలో తన మనస్సులోని మాటను బయటపెట్టాడు చందర్ పాల్

మరో మూడు వారాల తరువాత 41వ వడిలోకి అడుగుపెట్టబోతున్న ఈ క్రికెటర్..  164 టెస్టు మ్యాచ్ లను ఆడి 30 శతకాలతో 11 వేల 867 పరుగులు సాధించాడు. 51 పరుగుల సగటున ఆయన 11 వేల పరుగుల క్లబ్ లో చేరిన పాల్.. 12 వేల పరుగుల క్లబ్ లో చేరేందుకు మరో 133 పరుగల దూరంలో నిలిచాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఆరు ఇన్నింగ్స్ అఢిన పాల్.. కేవలం 90 పరుగులను మాత్రమే సాధించడంతో.. ఇక త్వరలో జరగనున్న అస్ట్రేలియా సిరీస్ లో ఆయనను జట్టులోకి తీసుకోవాలా..? వద్దా..? అన్న తరుణంలో ఆయన తన ఆశయాన్ని బయటకు చెప్పాడు. అయితే అస్ట్రేలియాతో ఆడే అవకాశం కోసం ఆర్తీగా ఎదురుచూస్తున్నాడు. మరి ఆయనకు అవకాశం లభిస్తుందో లేదో..? వేచి చూడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Indies  Shivnarine Chanderpaul  highest run scorer  12000 runs club  

Other Articles