michael clarke tweets, he is to be a dad

Australia captain michael clarke to be a dad

Australia captain Michael Clarke to be a dad, Australia, Michael Clarke, The Ashes 2015, Cricket, Ecstatic Australia Captain Michael Clarke to be a Dad, latest The Ashes, National News, International News, Sports News, Australia, England

Australia captain Michael Clarke took the occasion of the start of the first Ashes test against England to announce that he and his wife, Kyly, are expecting their first child.

నేను తండ్రిని కాబోతున్నాను.. ఆనందంలో కెప్టెన్ క్లార్క్

Posted: 07/08/2015 07:23 PM IST
Australia captain michael clarke to be a dad

ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్ తన అభిమానులకు సంతోషకరమైన వార్తను అందించాడు. అదేంటంటారా..? తాను తండ్రి కాబోతున్నాడు. తండ్రి కాబోతున్న వార్తను తన అభిమానులను, మిత్రులు, శ్రేయోభిలాషులతో కలసి పంచుకుని మరింత ఆనందం పోంతున్నాడు. ఇది నిజమేనా..? అని సందేహం కలుగుతుందా..? ఈ విషయాన్ని స్వయంగా క్లార్కే బుధవారం ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు వెల్లడించారు. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మైఖెల్ క్లార్క్ తమ కుటుంబంలోకి తొలి పాప రాబోతోందంటూ ట్విట్ చేశాడు. తన భార్య కైలీతో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇది ఇలా ఉంటే ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల యాషెస్‌ సిరీస్‌ బుధవారం నుంచి మొదలు కానుంది. కార్డిఫ్‌ వేదికగా తొలి టెస్ట్‌ జరగనుంది. చివరిసారిగా 2013లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ 0-5తో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఈసారి సొంతగడ్డపై ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లిష్‌ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. అయితే మరోసారి యాషెస్‌ ట్రోఫీని ముద్దాడాలని క్లార్క్‌సేన ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో తనకు వారసురాలు రాబోతున్న తరుణంలో చాలా ఉత్కంతగా ఎదురుచూస్తున్నానని కూడా ట్విట్ చేశాడు క్లార్క్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  australia  captain  michael clarke  dad  

Other Articles