Finally Virat Kohli Reveals why he is in love with anushka sharma | bollywood updates

Virat kohli reveals why he is in love with anushka sharma

virat kohli news, virat kohli press meet, virat kohli updates, virat kohli controversy, anushka sharma, anushka sharma controversies, anushka sharma liplock scenes, virat anushka news

Virat Kohli Reveals why he is in love with anushka sharma : Indian cricketer virat kohli finally told about his love secret. He told why he is in deeply love with anushka sharma.

అనుష్క వెంట కోహ్లీ ఎందుకు పరిగెడుతున్నాడో తెలుసా?

Posted: 04/30/2015 10:41 AM IST
Virat kohli reveals why he is in love with anushka sharma

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెట్ యువక్రీడాకారుడు విరాట్ కోహ్లీ మధ్య గాఢమైన ప్రేమ కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఇద్దరూ టూర్లపేరుతో విదేశాలను తిరిగొచ్చేశారు కూడా! అంతేకాదు.. వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించి కొన్ని వివాదాస్పద ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రేమపక్షులు తమ ప్రేమను బాగానే ఆస్వాదిస్తున్నారులెండి!

కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అనుష్క అక్కడ వాలిపోవడం, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఇరువురి ప్రస్తావన వచ్చినప్పుడు మురిసిపోవడం.. అబ్బో.. వీరి ప్రేమ తగలయ్యా! ఇండియాలో మరే ప్రేమజంటకు రానంత పబ్లిసిటీ ఈ లవ్ బర్డ్స్ కి అనతికాలంలోనే వచ్చేసింది. అంతా బాగానే వుంది కానీ.. ‘ఒకరినొకరిలో ఏం చూసుకుని ప్రేమించారు?’ అని కోహ్లీని ప్రశ్నించగా... తాను అనుష్కను ప్రేమించడం వెనుక గల కారణాలను విశదీకరించాడు. అనుష్క కూడా తనలాగే నిజాయితీపరురాలని, అందుకే ఆమె అంటే చాలా ఇష్టమని కోహ్లీ పేర్కొన్నాడు.

‘అనుష్క ఈజ్ లవ్లీ అండ్ సింపుల్ పర్సన్. నాలాగే ఆమె కూడా నిజాయితీపరురాలు. ఆ లక్షణాలే నన్ను ఆమె వైపుకు తిప్పుకుంటున్నాయి. అందుకే ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాను’ అంటూ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ వివరించాడు. మొన్నటివరకు తన ప్రేమ ప్రస్తావన వస్తే గుర్రుగా వ్యవహరించే కోహ్లీ.. ఈసారి అలా కాకుండా సింపుల్ గా సమాధానమివ్వడం విశేషంగా మారింది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశముందని.. అందుకే తన ప్రేమ గురించి కోహ్లీ తడబడకుండా చెప్పి వుంటాడని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka Sharma  Bollywood Affairs  

Other Articles