IPL Team Profile: Warner-led Sunrisers Hyderabad look to explode this season

Sunrisers hyderabad look to explode this season

hyderabad sun risers team hope to win ipl 8, hyderabad team hopes in ipl 8, hyderabad sun risers, IPL season 8, Indian Premier League., shikar dhawan, kumara sangakkara, dale steyn, camaron white, ishanth sharma, karan

Sunrisers Hyderabad, with the likes of Shikhar Dhawan and David Warner, have enough in their tank to surprise a few teams in the tournament. Undoubtedly, they are one of the most aggressive T20 teams on paper, but the focus right now is to get a good start in the eighth season of the Indian Premier League.

ఐపీఎల్ 8లో గెలుపుపై సన్ రైజర్స్ అంచనాలు

Posted: 04/06/2015 08:37 PM IST
Sunrisers hyderabad look to explode this season

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనమిదవ సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు గెలుపు పై అంచనాలు పెదరుగుతున్నాయి. ఎలాగైనా ఈ సారి మరోమారు టైటిల్ ను సాధించుకోవాలన్న కృతనిశ్ఛయంతో జట్టు సభ్యులు వున్నారని తెలుస్తోంది. ఎనమిదేళ్ల సుదీర్ఘ పయనంలో జట్టు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని పర్యాయాలు అభిమానులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. డెక్కన్ చార్జర్స్‌గా మొదలు పెట్టి సన్‌రైజర్స్‌గా మారిన ఈ టీమ్‌ను ఒక ఏడాది మినహా ప్రతీసారి వైఫల్యాలే వెంటాడాయి. భారీ హిట్టర్లు, టి20 స్పెషలిస్ట్‌లు, అగ్రశ్రేణి బౌలర్లను జట్టులో చేర్చుకున్నా... హైదరాబాద్ జట్టుకు అదృష్టం మాత్రం వరించడం లేదు. డెక్కన్ చార్జర్స్ నుండి సన్ రైజర్స్ గా నామకరణం చేసినా హైదరబాద్ జట్టు రాణించలేక పోవడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.

అయితే. ఐపీఎల్-8 సీజన్ కోసం పెద్ద ఎత్తున మార్పులు చేసిన జట్లలో సన్ రైజర్స్ కూడా ఒకటి. గత రెండు సీజన్లుగా అంచనాలు అందుకోలేని బ్యాటింగ్ లైనప్ ఈ సారి చెలరేగితే విజయం దిశగా అడుగులు వేయడం ఖాయమని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. సన్‌రైజర్స్ చేతికి హైదరాబాద్ పగ్గాలు అందిన తరువాత జాతకం మారుతుందని అశించానా.. కేవలం సంగక్కర, స్టెయిన్, శిఖర్ ధావన్ సహా పాత జట్టులోని 20 మందిని రైజర్స్ కొనసాగించింది. బ్యాటింగ్‌లో మెరుపు ప్రదర్శన లేకపోయినా స్టెయిన్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అద్భుతంగా రాణించడంతో ‘ప్లే ఆఫ్’కు అర్హత సాధించిన జట్టు... చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

2015 సీజన్ కోసం 13 మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకున్న సన్‌రైజర్స్ మరో 11 మందిని విడుదల చేసింది. ఫించ్, మిశ్రా, స్యామీ జట్టుకు దూరమయ్యారు. కొత్తగా పీటర్సన్, మోర్గాన్, రవి బొపారా, విలియమ్సన్, బౌల్ట్, ప్రవీణ్ కుమార్ వచ్చారు. అయితే కౌంటీల కోసం టోర్నీ ఆరంభానికి ముందే పీటర్సన్  తప్పుకున్నాడు. రైజర్స్‌కు మూడో సీజన్‌లో ఐదో కెప్టెన్ వచ్చాడు. భారత స్టార్ ఆటగాడు ధావన్‌ను కాదని ఈసారి వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కొత్తగా స్పిన్ దిగ్గజం మురళీధరన్‌ను మెంటార్‌గా పెట్టుకున్నారు. బలాబలాలు చూస్తే కనీసం ప్లే ఆఫ్‌కు ఎలాగైనా అర్హత సాధించాల్సిన జట్టుగా కనిపిస్తోంది. ప్రపంచకప్ నుంచి ఫామ్‌లో ఉన్న ధావన్, విలియమ్సన్‌తోపాటు వార్నర్ కూడా చెలరేగి భారీ స్కోరు అందిస్తేనే రైజర్స్ విన్నర్ కాగలదు. స్టెయిన్ ఉండగా, కివీస్ సంచలనం బౌల్ట్‌కు ఎన్ని మ్యాచ్‌లలో అవకాశం వస్తుందనేది చూడాలి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL season 8  hyderabad sun risers  shikar dhawan  

Other Articles