Pm modi calls nawaz sharif ahead of india pakistan world cup clash

Indian Prime Minister Narendra Modi called Pakistan PM Nawaz Sharif, indian PM modi calls counterpart sharif, modi calls nawaz sharif, modi tweets every team player, modi asks team indian to perfom well, modi on cricket world cup, modi on saarc reigion teams in world cup, icc cricket world cup 2015, bangladesh, india, srilanka, pakistan, afghanistan, modi wishes to team india

Indian Prime Minister Narendra Modi called Pakistan PM Nawaz Sharif on Friday ahead of the high voltage India, Pakistan World Cup clash on Sunday in Adelaide.

ప్రపంచ కప్ కు ముందు షరీఫ్ తో మోడీ పలకరింపు

Posted: 02/13/2015 06:06 PM IST
Pm modi calls nawaz sharif ahead of india pakistan world cup clash

మరో ప్రపంచ సమరానికి అంతా సిద్దమయ్యింది. రణరంగంలోకి దిగి నువ్వా నేనా అంటూ తేల్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి ప్రత్యర్థి దళాలు. ఈ తరుణంలో అందరినీ అకర్షించే అరుదైన పోరు దాయాధులదే. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించే ఈ పోరుకు మరి కొన్ని గంటల్లో తెర లేవనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీష్ తో ముచ్చటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.

ప్రధాని నవాజ్ షరీస్ సహా అప్ఠనిస్తాన్ అధ్యక్షడు అష్రఫ్ ఘని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా, శ్రీలంక అద్యక్షుడు సిరిసేనలతో తాను మాట్లాడానని ప్రధాని ట్విట్ చేశాడు. సార్క దేశాలలో భాగం పంచుకుంటున్న ఐదు దేశాలు ప్రపంచ క్రికెట్ కప్ లోనూ పాలుపంచుకోవడం శుభాసూచకమన్నారు. క్రికెట్ ప్రపంచకప్ ద్వారా ఆయా దేశాలలో క్రీడాస్ఫూర్తి ఇనుమడిస్తుందని, ఆయా దేశాల క్రీడాభిమానులకు ఇది ఒక పండగ వాతావరణమని ఆయన కొనియాడారు.

pm-tweet

అదే సమయంలో ప్రపంచకప్ మ్యాచ్ లలో తొలి పోరున పాకిస్థాన్ తోనే ఆరంభిస్తున్న తరుణంలో టీమిండియాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కప్ పోరులో వీజేయులుగా తిరిగిరావాలని ఆయన ఆకాంక్షించారు. టీమిండియా  క్రీడాకారులందరికీ పేరు పేరున ఆయన ట్విట్ చేశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని అగ్గి పిడుగులా కొనియాడిన మోడీ, రవీంద్ర జెడేజాను సార్ అని సంబోధించారు. ఇందులో భాగంగానే ఆయన ప్రతీ ఆటగాడి నుంచి ఒక్కోటి ఆశిస్తూ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. టీమిండియా ఆటగాళ్ల నుంచి మోదీ ఏమీ ఆశిస్తున్నారో మీరే చూడండి..

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ టోర్నీలో బంతిని బలంగా బాది టీమిండియా గర్వించే విధంగా చేయాలి. నీవు ఆ పని చేస్తావని నాకు నమ్మకం ఉంది.

 వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వెరీ బెస్ట్. యావత్ భారత జాతి నీపై చాలా ఆశలు పెట్టుకుంది. అది చేసి చూపించాలి.

శిఖర్ ధావన్.. నీవు ఆడిన ప్రతీ సారి టీమిండియాకు మంచి ఆరంభం లభిస్తుంది. ఈ టోర్నీలో మరోసారి ఆకట్టుకోవాలి. ప్రపంచకప్ లో నీవు కీలక పాత్ర పోషించాలి.

రోహిత్ శర్మ..  వన్డేల్లో రెండు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరపురాని గుర్తింపు తెచ్చావు. భారత్ లోని క్రికెట్ అభిమానులతో పాటు నేను కూడా మరోసారి ఆ ఇన్నింగ్స్ రావాలని ఆశిస్తున్నాను.

ఓ మై యంగ్ ఫ్రెండ్ అజ్యింకా రహానే.. ఈ వరల్డ్ కప్ నీకు చక్కటి అవకాశం.  దీన్ని చక్కగా వినియోగించుకుని దేశ ప్రతిష్టను  పెంచాలి.

అంబటి రాయుడు.. ఈ టోర్నమెంట్ పరుగుల వరద సృష్టించి కీలక పాత్ర పోషించు.

సర్ రవీంద్ర జడేజా..  నీకు ఫ్యాన్ కానిది ఎవరు?, నీ ఆల్ రౌండ్ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

అక్షర్ పటేల్.. నీ స్పిన్ అండ్ బౌన్స్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి టీమిండియా గెలుపులో భాగస్వామ్యం కావాలి.

భువనేశ్వర్ కుమార్.. ప్రతీ మ్యాచ్ లోనూ బంతిని స్వింగ్ చేసి టీమిండియాకు చక్కటి బ్రేక్ ఇవ్వాలి.

మోహిత్ కుమార్.. నీవు లైన్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి టీం విజయానికి దోహద పడాలి.

మహ్మద్ షమీ.. వెరీ వెరీ బెస్ట్ . వరల్డ్ కప్ లో బాగా రాణించి.. ఎక్కువ వికెట్లు తీయాలి.
 
సురేష్ రైనా..  ఫీల్డ్ లో చురుకుగా ఉంటావు. నీవు బంతిని బలంగా కొట్టి స్టేడియం బయటకి పంపించు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  nawaz sharif  world cup  team india  

Other Articles