Chris rogers australia players did not dishonour memory of phillip hughes

Australia cricketers, injury scare, shaun marsh injury scare, shaun marsh hand injury, Australian criceter shaun marsh, shaun marsh injured, marsh hit by josh hazlewood, Shane Watson, Australian cricketer shane watson, Watson injured, Watson injured in practice, Shane Watson injured in MCG nets, Watson gets blow on head, watson hit by bouncer, watson hit by james pattinson, watson on knees,

Chris Rogers has defended Australia’s on-field conduct after Jonathan Agnew, the BBC cricket correspondent, accused them of dis honoring the memory of their fallen team-mate, Phillip Hughes, with continued sledging during the recent Test series with India

అస్ట్రేలియా క్రికెటర్లను ఫిలిప్ హ్యూస్ వెంటాడుతున్నాడా.?

Posted: 01/14/2015 02:45 PM IST
Chris rogers australia players did not dishonour memory of phillip hughes

భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా క్రీడాకారులను వెంటాడుతోంది. అంతేకాదు మూడో టెస్టు కోసం సమాయత్తం అవుతున్న సమయంలో అసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్. జేమ్స్ పాటిన్ సన్ వేసిన బౌన్సర్ బంతి జోరుగా వచ్చి హెల్మెట్ పై తగిలింది. దీంతో ఆయన అక్కడే కిందపడ్డాడు. వాట్సన్ కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా.. ఇలాంటి గాయాలు తగిలి ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎందుకని వారి మదిన ప్రశ్నలు తొలుస్తున్నాయి

ఈ ఆందోళనలో భాగంగానే ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సొంతగడ్డపై భారత్ తో చివరి టెస్టు ఆడిన ఆయన ఆదే తన ఆఖరి టెస్టు ఆని ప్రకటించడానికి కారణం కూడా ఫిలిఫ్ హ్యూస్ ఘటన వెంటాడటమేనని తేల్చిచెప్పాడు. భారత్‌తో సిడ్నీ టెస్టే స్వదేశంలో తన చివరి మ్యాచ్ అని సిరీస్ మధ్యలో రోజర్స్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ అనూహ్య నిర్ణయానికి ఓ కారణం ఉంది. ‘బ్రిస్బేన్‌లో భారత్‌తో రెండో టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఆడాడు. అప్పుడు తాను ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాని... బంతి రాగానే తల వెనక్కి తిప్పానని. అది వచ్చి హెల్మెట్ మీదే మెడ భాగంలో తగిలిందని చెప్పుకోచ్చాడు.

సరిగ్గా హ్యూస్‌కు బంతి తగిలిన ప్రదేశం కూడా అదేనన్నాడు. దీంతో తాను ఒక్క క్షణం షాక్‌కు గురయ్యానన్నాడు. అయితే అదృష్టవశాత్తు తనకు ఏం కాలేదన్నాడు. ఆ రోజు రాత్రి చాలాసేపు తాను గాయం గురించే ఆలోచించానని, 37 ఏళ్ల తాను ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడగలనో తెలియదని అందుకే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించానన్నాడు. యాషెస్ ఆడాలనే కల తనకు మిగిలుందని అందచేత ఇంగ్లండ్ వెళ్లి ఆ టోర్నీ ఆడాలనుకుంటున్నాన్నాడు. ఈ లోగా స్వదేశంలో టెస్టులూ లేని కారణంగా సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ అని ప్రకటించానని చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా మంది సన్నిహితులతో మాట్లాడి చర్చించానన్నాడు. తమ కళ్ల ముందు చెలరేగి ఆడుతున్న హ్యూస్.. గాయంతో కొన్ని రోజుల్లోనే విగత జీవిగా మారడం.. అనంతవాయువుల్లో కలసిపోవడంతో ఆ ఘటన అస్ట్రేలియన్ క్రీడాకారులను వెంటాడుతుంది. అదీకాక రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఓ క్రికెటర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేలా చేసిందన్న మాట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shaun Marsh  Shane Watson  Australia criket team  Chris Rogers  opener  Retirement  

Other Articles