Indias 15 man world cup squad to be revealed on january 6

indian cricet control board, indian team for world cup, bcci elects final team for world cup, world cup 2015 indian team, icc world cup 2015 indian cup, icc world cup 2015, indian final team, world cup indian team, bcci latest news, bcci updated news,

The Indian ODI squad for the upcoming triangular cricket series in Australia as well as the ICC World Cup 2015 that follows almost immediately will be picked by the five-man selection panel here on January 6

6న వరల్డ్ కప్ కు టీమిండియా జట్టు ఎంపిక

Posted: 01/03/2015 09:49 PM IST
Indias 15 man world cup squad to be revealed on january 6

ప్రపంచ క్రికెట్ అభిమానులందరు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రపంచ క్రికెట్ వరల్డ్ కఫ్ కు అన్ని దేశాలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ఈ నెల 6న ఎంపిక చేయనున్నారు. చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశమై తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించనుంది. ఇంతక ముందు ప్రకటించిన 30 మందితో కూడిన ప్రాబబుల్స్‌ నుంచి తుది జట్టున ఎంపిక చేస్తామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పాటిల్ తెలిపారు. ముంబైలో జనవరి 6న ముక్కోణపు సిరిస్‌తో పాటుగా ఐసీసీ వరల్డ్ కప్ 2015కు తుది జట్టును ప్రకటిస్తామని అన్నారు.

ఆస్టేలియా, ఇంగ్లాండ్, భారత్ దేశాల మధ్య జరగనున్న ముక్కోణపు సిరిస్‌కు ఆస్టేలియా ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరిస్ అనంతరం ఈ ముక్కోణపు వన్డే సిరిస్ జనవరి 16న ప్రారంభమై ఫిబ్రవరి 1న ముగుస్తుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫిబ్రవరి 14న ఆరంభం కానుంది. మార్చి 29న జరిగే ఫైనల్‌తో ఈవెంట్ ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్ సుప్రసిద్ధ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  icc world cup 2015  team india  bcci  

Other Articles