అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. ఇండియా పర్యటనలో తమను ఓడించిన భారత జట్టుపై తాము ప్రతీకారం తీర్చుకుంటామన్న అసీస్ అన్నంత పని చేస్తున్నారు. నాలుగు టెస్టు మ్యాచులలో రెండింటిని తన ఖాతాలోకి వేసుకున్న అసీస్.. మరో విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. టెస్ట్ సీరీస్ ను సొంతం చేసుకుని ఇటీవల మరణించిన తమ సహచర క్రీడాకారుడు ఫిలిఫ్ హ్యస్ కు అంకితమిచ్చేందుకు సన్నధమవుతున్నారు. అసీస్ గడ్డపై పోరాడి తమ సత్తా చాటుతామని చెప్పిన టీమిండియా మాత్రం అనుకున్నదానికి భిన్నంగా పోరులో చతికిల పడింది. విదేశీ గ్రౌండ్ లలో తమ ఆటతీరును ప్రదర్శించడంలో గతం నుంచి కొంత వెనుకంజలో వున్ భారత్ ఈ సారి కూడా అదే ఫలితాలను నమోదు చేసుకోనుంది.
ఆసీస్ గడ్డపై టీమిండియా మరోసారి చతికిలబడింది. ఆసీస్ అటాకింగ్ ను ఎదుర్కోవడంలో విఫలమైన టీమిండియా ఆటగాళ్లు బొక్కబోర్లా పడ్డారు. తొలి టెస్టు ఓటమితో పాఠాలు నేర్వని భారత్ పేలవమైన ఆటతో రెండో టెస్టులో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఆదిలో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ఓపెనర్ రోజర్స్(55)పరుగులతో రాణించడంతో ఆసీస్ కుదుటపడింది. అంతకుమందు ఆసీస్ డేవిడ్ వార్నర్ (6), షేన్ వాట్సన్ (0) లను పెవిలియన్ కు పంపిన ఇషాంత్ శర్మ అదే ఊపును కొనసాగించి రోజర్స్ ను అవుట్ చేశాడు. అటు తరువాత కెప్టెన్ స్టీవెన్ స్మిత్(28)పరుగులు చేసి రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరగా హడిన్ (1) కూడా అవుట్ అయ్యాడు. 122 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది. నాల్గో రోజు ఆటలో టీమిండియా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది .
వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికే ఏడు వికెట్లను నష్టపోయిన టీమిండియా ఒక్కసారిగా చతికిలబడింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు మరమ్మత్తులు చేపట్టాడు. ఇరువురూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులు చేసింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఆసీస్ కు 2-0 ఆధిక్యం లభించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more