Bowler umesh yadav sensational comments mahendra singh dhoni virat kohli captainship india team

indian bowler umesh yadav, umesh yadav, umesh yadav latest news, umesh yadav interview, umesh yadav press meet, umesh yadav virat kohli, umesh yadav mahendra singh dhoni, mahendra singh dhoni latest news, mahendra singh dhoni cricket matches, virat kohli latest news, telugu news

bowler umesh yadav sensational comments mahendra singh dhoni virat kohli captainship india team

‘‘ధోనీకంటే కోహ్లీయే బెస్ట్’’.. సంచలన కామెంట్లు!

Posted: 11/27/2014 10:51 AM IST
Bowler umesh yadav sensational comments mahendra singh dhoni virat kohli captainship india team

ఐపీఎల్ మ్యాచుల నేపథ్యంలో తన బౌలింగ్ సత్తాను చాటుకుని టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్న ఫాస్ట్-బౌలర్ ఉమేశ్ యాదవ్... మహేంద్రసింగ్ ధోనీ కంటే కోహ్లీయే చాలా బెస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కెప్టెన్’షిప్’లో జట్టులో వుండే కుర్రాళ్లంతా స్వేచ్ఛగా వుండగలమని... అదే ధోనీ సారథ్యంలో అలా కుదరదని బహిరంగంగా చెప్పేశాడు. టీమిండియా జట్టుకు కోహ్లీలాంటి కెప్టెన్ వుంటేనే చాలామంచిదన్న అభిప్రాయాన్ని కూడా అతడు వెల్లడించినట్లు సమాచారం! అయితే చివరగా తాను చెప్పిన మాటల్ని అర్థం చేసుకోవద్దని, ధోనీ కూడా మంచోడేనంటూ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు!

ఇటీవలే కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్’ను భారత్ 5-0 క్లీన్’స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ఇక ధోనీ అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాలో తొలిటెస్టుకు కూడా అతడే కెప్టెన్’గా వ్యవహరించనున్నాడు. అతడు సారథ్యంలో వున్నప్పుడు అతనితో కలిసి ఆడిన బౌలర్ ఉమేశ్ యాదవ్.. అతని వ్యక్తిత్వం ఎటువంటిదో వివరించాడు. ధోనీతో పోల్చుకుంటే కోహ్లీ చాలా ఫ్రెండ్లీగా వుంటాడని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లీ సారథ్యంలో వాతావరణం మొత్తం భిన్నంగా వుంటుంది. అతడు కుర్రాళ్లతో ఒకడిగానే వుంటాడు. ఒకే వయసువాళ్లం కాబట్టి అతడితో మాట్లాడటం, సమస్యల గురించి చర్చించడం చాలా సులభమవుతుంది’’ అని పేర్కొన్నాడు. అయితే తాను చెప్పిన ఈ మాటలకు తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ధోనీ వ్యక్తిగత్వం కూడా మంచిదేనని అన్నాడు.

ఈ నేపథ్యంలోనే ధోనీ గురించి కూడా మాట్లాడుతూ.. ‘‘ధోనీ భాయ్ కూడా మాట్లాడేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. కానీ ఆయన చాలా సీనియర్ ఆటగాడు కాబట్టి.. అతడి దగ్గర మేం కాస్త జాగ్రత్తగా వుంటాం. అతనితో ఏమైనా మాట్లాడాలన్నా ముందుగానే పునరాలోచన చేసుకుని వెళ్తాం. అయితే కోహ్లీతో చాలా సరదాగా వుంటాం. అతడితో ఏదైనా మాట్లాడొచ్చు’’ అంటూ వారిద్దరు తమ మనస్తత్వాలు ఎలా వుంటాయోనని క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు. కేవలం పేస్’పైనే కాకుండా నియంత్రణపై కూడా దృష్టి పెట్టానని పేర్కొంటున్న ఇతగాడు.. ఇండియా జట్టును గెలిపించడంలో తనవంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : umesh yadav  virat kohli  mahendra singh dhoni  india cricket team  telugu news  

Other Articles