Kolkata knigh riders won champions league first match against chennai super kings

kolkata knight riders, chennai super kings, champions league t20 2014, mahendra singh dhoni, gautam gambhir, champions league matches, andrew russell

kolkata knigh riders won champions league first match against chennai super kings

గంభీరుడి జట్టుముందు మట్టికరిచిన ధోనీ సేన!

Posted: 09/18/2014 01:53 PM IST
Kolkata knigh riders won champions league first match against chennai super kings

ఛాంపియన్ లీగ్స్ టీ20 మొదటి మ్యాచ్ సందర్భంగా తలపడిన గంభీర్, ధోనీ సేనల మధ్య హోరాహోరీగానే పోటీ జరిగింది. ఎప్పటిలాగే ఈమ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి నిముషందాకా ఎవరు గెలుస్తారోనన్న ఒక్కటే టెన్షన్! మొదట్లో ధోనీసేనే చాలా సులభంగా గెలుస్తుందని భావించిన తరుణంలో... గంభీరుడి జట్టు వారి ఆశల మీద నీళ్లు చల్లి అద్భుతంగా విజయకేతనాన్ని ఎగురవేసింది. ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ ను తన్నుకుపోయింది. స్టేడియంలో వున్న అభిమానులు సైతం ధోనీ సేన ఓడిపోవడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే.. కోల్ కతా జట్టు మొదట్లో అంత ఘోరంగా ప్రదర్శించింది.

10 పరుగులకే 3 వికెట్లు.. 51 పరుగులకే 5 వికెట్లు.. 66 బంతుల్లో 107 పరుగులు చేయాలి.. మిగిలిన ప్రధాన బ్యాట్స్ మెన్ ఒక్కడే! తక్కినవారంతా బౌలర్లే. దీంతో ధోనీ సేన సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ ధీమా వ్యక్తం చేశారు. కానీ.. అనుకోని విధంగా మ్యాచ్ ఎన్నో ట్విస్టులు వచ్చి చేరిపోయాయి. టెన్ డస్కాటె, ఆండ్రి రసెల్ కోల్ కతా రాతనే మార్చేశారు. తమ అద్భుత ప్రదర్శనతో ధోనీసేనకు చుక్కలు చూయించారు. ఒకరు ఫోర్ల బాదుతూ ఫీల్డర్లను పరుగులు పెట్టిస్తుంటే.. మరొకరు సిక్సర్లు కొడుతూ ఫీల్డర్లకు ఆకాశంలో చుక్కలు చూయించేశాడు. దీంతో ఈసారి లీగ్ ను కోల్ కతా అద్భుతంగా శుభారంభం చేసింది.

బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు సాధించింది. ఇందులో కెప్టెన్ ధోనీ 20 బంతుల్లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లు పరమచెత్తగా ఆడారు. ఇక, 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతాకు మొదట్లో గట్టి దెబ్బనే తగిలింది. మూడో ఓవర్లోనే ఆశిష్ నెహ్రా బౌలింగ్ లో వరుసగా గంభీర్, మనీష్ పాండేలు పవేలియన్ కు చేరిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన యూసుఫ్ పఠాన్ ను మోహిత్ శర్మ వెనక్కి పంపించేశాడు. ఇతని తర్వాత వచ్చిన మన్విందర్ బిస్లా, సూర్యకుమార్ యాదవ్ లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో కోల్ కతా ఓటమి ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు.

కానీ, క్రీజులోకి అడుగుపెట్టిన రసెల్, డస్కటె ఆటగాళ్లు మ్యాచ్ వాతావరణాన్ని మలుపు తిప్పేశారు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. 66 బంతుల్లో 107 పరుగులను సునాయాసంగా ముగించేశారు. వీరిద్దరిలో ముఖ్యంగా రసెల్ అద్భతంగా విజృంభించేశాడు. కేవలం 25 బంతుల్లోనే 58 పరుగులు సాధించి.. జట్టును విజయబాటకు తీసుకెళ్లాడు. వీళ్లిద్దరూ ఆరో వికెట్ కు 80 పరుగులు జోడించి.. ఛాంపియన్ లీగ్ లో కోల్ కతాకు శుభారంభాన్ని అందించారు. దీంతో గెలుస్తుందన్న ధోనీ సేన.. వీరి జోరును అడ్డుకోలేకపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles