Arjun tendulkar playing in sachin s cricket sachin cricket tourney

sachin tendulkar, sachin tendulkar images, sachin tendulkar cricket photos, sachin tendulkar records, sachin tendulkar matches, sachin tendulkar family, sachin tendulkar son, arjun tendulkar, arjun tendulkar cricket, master blaster school cricket championship tourney

master blaster sachin tendulkar's son playing cricket tourney named by his father : arjun tendulkar is also one of the player in master blaster school cricket championship tourney

తండ్రి పేరిట జరిగే టోర్నీలో సచిన్ తనయుడు

Posted: 09/16/2014 01:52 PM IST
Arjun tendulkar playing in sachin s cricket sachin cricket tourney

సచిన్ టెండుల్కర్ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు. ప్రపంచ క్రికెట్ లో సచిన్ ఓ సంచలనం. ఎందరో క్రీడాకారులకు ఆయన ఆదర్శం. టెండుల్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఓ పాఠం లాంటిది. కృషి, పట్టుదలతో సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం మాస్టర్ బ్లాస్టర్ ది. ఆయనకున్న రికార్డులు మరెవరికి లేవు. ఆ క్రికెట్ దేవుడు విరామం ప్రకటించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయినా సరే సచిన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సచిన్ పేరిట ఓ స్కూల్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. దీని పేరు ‘మాస్టర్ బ్లాస్టర్ స్కూల్ క్రికెట్ చాంపియన్ షిప్’ ఈ టోర్నీలో అమ్మాయిలు అండర్ 16విభాగం, అబ్బాయిలకు అండర్ 14 విభాగంలో నిర్వహిస్తున్నారు.

సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ ఈనెల 20వరకు జరుగుతుంది. ఆసక్తికరంగా చాంపియన్ షిప్ లో సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా ఆడుతున్నాడు. ధీరుభాయ్  అంబానీ ఇంటర్నేషనల్ స్కూలు జట్టు తరపున అర్జున్ ఆట ఆడుతున్నాడు. తండ్రి పేరుతో జరుగుతున్న పోటీలో తనయుడు ఆడటం.. అర్జున్ కే దక్కిన అదృష్టం. నాకౌట్ పద్దతిలో జరిగే పోటీలో.. ఎవరు గెలుస్తారో చూడాలి. గెలిచిన జట్టుకు సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరగనుంది. అర్జున్ చాంపియన్ గా నిలిస్తే తండ్రిచే కప్ అందుకునే మరో అరుదైన మధుర క్షణం అతని సొంతం అవుతుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  arjun tendulkar  cricket tourney  latest news  

Other Articles