Sourav ganguly warned indian cricket team to change the way and also warned selectors

sourav ganguly, ganguly, ganguly wiki, ganguly family, india cricket team, dhoni, bcci, india england match, dadha, cricket news, indian cricket players, sunil gavaskar latest updates

ganguly warned team india selectors on selection process and team leading : indian team has to change its way to get out of failures says sourav ganguly

టీమిండియా, సెలక్టర్లకు దాదా వార్నింగ్

Posted: 08/20/2014 05:44 PM IST
Sourav ganguly warned indian cricket team to change the way and also warned selectors

ధోని సేనపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇంగ్లండ్ టూర్ లో అద్బుతమైన పేలవ ఆటతీరు చూసిన ప్రతి ఒక్కరూ టీంను తిట్టిపోస్తున్నారు. జట్టుపై అభిమానం ఎక్కవున్నవారయితే ఆవేశం ఆపుకోలేక సోషల్ సైట్లలో బాధను పంచుకుంటున్నారు. అభిమానుల నమ్మకాన్ని పెవిలియన్ లో తాకట్టు పెట్టిన క్రికెటర్లపై ఒక్కొక్కరూ పీకలదాకా కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ దాదా, టీం మాజి కెప్టెన్ సౌరభ్ గంగూళీ టీమిండియాపై సీరియస్ అయ్యాడు. సీరియస్ గా ఉండే దాదా.., ఆటగాళ్ళు, సెలక్టర్లు అని తేడాలేకుండా వరుసపెట్టి బ్రెయిన్ వాష్ చేశాడు. కష్టపడటం లేదు, ఆటపై చిత్తశుద్ధి లేదు, గెలవాలన్న తపన అసలు కన్పించటం లేదని జట్టుపై మండిపడ్డాడు. దేశ ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో క్రికెటర్లు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. అభిమానుల గుండెల్లో మనకున్న స్థానం గుర్తించి మెలగాలని హితబోధ చేశాడు.

అసలేం చేస్తున్నారు?

ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలక్టర్లనయితే ఎడాపెడా మాటలతో వాయించాడు సౌరభ్. అల్లాటప్పాగా నిర్ణయాలు తీసుకోవటానికి ఇదేమైనా గల్లీ క్రికెటా అని సూటిగా ప్రశ్నించాడు. గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పాడు. ప్లేయర్లను ఎంపిక చేసేటపుడు టాలెంట్ గుర్తించేటపుడు పాటించాల్సిన కనీస నియమాలు తెలుసుకోవాలన్నారు. కష్ట సమయంలో కూడా ఎవరు రన్స్ తీసుకురాగలరు?, అవకాశాలు తక్కువ ఉన్నపుడు కూడా ఎవరు సత్తా చాటగలరు, 50 పరుగులకే 5 వికెట్లు పోయినా ఎవరు టీంను పరుగులు పెట్టిస్తారు అనేది తెలుసుకుని జట్టును ఎంపిక చేయాలన్నారు. జాగ్రత్తగా ఎంపిక చేయకపోతే ఆ ప్రభావం జట్టు గెలుపు ఓటములపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్నారు. టీంను సెలక్ట్ చేసేటపుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి అని దాదా వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ సిరీస్ తో ధోని కెప్టెన్సికే ముప్పు వచ్చి చివర్లో తప్పింది. టీంలో ఎవరూ చెప్పుకోదగ్గట్లు ఆడలేదు. అంతా పెవీలియన్ వైపు వెళ్ళేందుకే ఆసక్తి చూపారు. దీంతో మాజి క్రికెటర్లకు తీవ్ర ఆగ్రహావేశం తెప్పించింది సునీల్ గవాస్కర్ అయితే వన్డేలు ఆడటం చేతకాకపోతే.., టెస్టులు ఆడుకోండి అని ఫైర్ అయ్యాడు. ఇంతమంది విమర్శలతో అయినా టీమిండియా మారుతుందో లేక.., ఎవరేమంటే మా కేంటి అన్నట్లు వ్యవహరిస్తుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sourav ganguly  indian cricket team  bcci  selectors  

Other Articles