Indian cricket team captain mahendra singh dhoni fires on media and bcci

mahendra singh dhoni, mahendra singh dhoni interview, mahendra singh dhoni news, england vs india test matches, indian cricket team players

indian cricket team captain mahendra singh dhoni fires on media and bcci : mahendra singh dhoni fires on media for asking some questions on his captaincy

ధోనీ కెప్టెన్ గా తప్పుకుంటున్నాడా..?

Posted: 08/18/2014 04:24 PM IST
Indian cricket team captain mahendra singh dhoni fires on media and bcci

ఇంగ్లాండ్ గడ్డపై మన భారత క్రికెట్ జట్టు ఎటువంటి ఘోర పరాజయాలు మూటగట్టుకుందో మనందరికీ తెలిసిందే! కేవలం లార్డ్స్ మైదానంలో తప్ప.. మిగిలిన అన్ని మ్యాచులు ఇండియా టీమ్ దారుణంగా ఓటమి పాలయ్యింది. మంచి బ్యాట్స్ మెన్స్ వున్నప్పటికీ ఎవరూ సరిగ్గా ప్రదర్శించలేకపోయారు. ఇక ధోనీ విషయానికి వస్తే.. ఇతడు కూడా చాలా దారుణంగా తన ఆటను ప్రదర్శించాడు. చాలా కూల్ గా వుంటూ గెలుపుదిశలో టీమ్ ను తీసుకెళ్లే ధోనీ.. ఇంగ్లాండ్ టూర్ లో మాత్రం కెప్టెన్ గా విఫలమయ్యాడు. దీంతో ఈయనపై మాజీ క్రికెటర్లందరూ తీవ్రంగా విమర్శలు లేవనెత్తారు. ధోనీని కెప్టెన్సీగా తొలగించాలంటూ అందరూ తమతమ వాదనలను వినిపించారు.

ఇదిలావుండగా.. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ ఘోరంగా పరాభవాన్ని ఎదుర్కోవడంతో దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో బీసీసీఐ బోర్డు పెద్దలతోపాటు కొంతమంది మీడియా ప్రతినిధులు ధోనీ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అయితే వాటన్నింటికీ సమాధానంగా ధోనీ కూడా తిరిగి ప్రశ్నలను సంధించాడు. ముఖ్యంగా.. ‘‘ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి మీరు వైదొలుగుతారా..?’’ అని అడిగిన ప్రశ్నకు ధోనీ జవాబిస్తూ.. ‘‘ఇదే ప్రశ్న మీరు నన్ను 2011లో అడగలేదా..?’’ అంటూ తిరిగి ప్రశ్నించాడు. అలాగే.. కెప్టెన్ పదవిలో వుండానో, వైదొలుగుతానో తెలుసుకోవాలంటే మరికొన్నాళ్లవరకు వేచి చూడాలని ఆయన మీడియాకు సూచించాడు.

ఈ నేపథ్యంలో మరొకి మీడియా ప్రతినిధి.. ‘‘ఐపీఎల్ కారణంగానే భారత ఆటగాళ్లు సరైన ఆటతీరు కనబర్చలేకపోయారా..?’’ అని ప్రశ్న వేయగా.. దానికి ధోనీ... ‘‘ఆ విషయం గురించి నన్నెందుకు అడుగుతారా..? బీసీసీఐనే అడగండి’’ అని గుర్రుగా సమాధానమిచ్చాడు. 2011లో టీమిండియా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై చాలా దారుణంగా ఓటమి చవి చూసింది. అప్పుడు కూడా ధోనీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తరుణంలో ధోనీ కెప్టెన్ గా తప్పుకోవాలంటూ మాజీలతో ఇతర ఆటగాళ్లు కూడా హితువు పలికారు. అదే విషయాన్ని ధోనీ ఇక్కడ గుర్తు చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles