Rahul dravid comments sachin tendulkar centuries

rahul dravid latest news, rahul dravid comments sachin, sachin tendulkar latest news, rahul dravid sachin tendulkar, sachin tendulkar centuries, rahul dravid cricket history, sachin tendulkar cricket history

Rahul dravid comments sachin tendulkar centuries : Indian famous batting player Rahul dravid denies the comments on sachin tendulkar that he is selfish. He explained why india loss the matches when sachin done 100 runs in Innings

భారత క్రికెటర్లే సచిన్ ను నెగ్గకుండా చేశారట!

Posted: 08/05/2014 03:23 PM IST
Rahul dravid comments sachin tendulkar centuries

భారత దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన దీర్ఘ క్రికెట్ జీవితంలో ఎదుర్కున్న వైఫల్యాలన్నింటికీ మన భారతీయులే ముఖ్య కారణమట! ఆయన సెంచరీలు చేసిన ప్రతీసారి మన ఆటగాళ్లే పేలమొహాలు పెట్టుకుని.. మ్యాచ్ లు ఓడిపోయేలా చేశారని భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ స్పష్టం చేశారు. సచిన్ టెండూల్కర్ తన స్వార్థం కోసమే సెంచరీలు చేశారని గతంలో కొంతమంది వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ద్రావిడ్ తప్పుపడుతూ... సంచలనమైన వ్యాఖ్యలు చేశారు.

బ్యాట్స్ మన్ అన్న తర్వాత ఎవరైనా సెంచరీల మీద దృష్టిపెట్టడం సహమేనని.. పరుగులు సాధిస్తేనే జట్టు లబ్ధిపొందుతుందన్న భావనతోనే వాళ్లు సెంచరీల దిశగా పావులు కదుపుతారని ఆయన స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణగా స్వయంగా తానేనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఓ ఆటగాడు వంద సెంచరీలు చేస్తే.. వాటిలో కొన్ని నిరర్థకమై వుండొచ్చు కానీ.. అదే సమయంలో ఆ వంద శతకాల్లో ఎన్నో భారత్ కు లాభించిన ఇన్నింగ్స్ కూడా వుండొచ్చు. కాబట్టి ఎవ్వరిని తేలిగ్గా తీసిపారెయ్యకూడదు’’ అని ఆయన విశ్లేషించాడు.

ఈ నేపథ్యంలోనే.. సచిన్ కూడా ఒక మానవమాత్రుడేనని, టెస్టుల్లో ఆయన ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడినా అవి మరుగున పడిపోయాయని ఆయన తెలిపారు. అందుకు ముఖ్య కారణం ఏమిటంటే.. సచిన్ బాగా ఆడిన మ్యాచ్ లలో ఇతర బ్యాట్స్ మెన్ లతో సహా భారత బౌలర్లు కూడా పేలవగా బౌలింగ్ వేయడంతోనే ప్రత్యర్థులు నెగ్గారని... అందువల్లే సచిన్ ప్రదర్శనలకు విలువ లేకుండా పోయిందని ఆయన వివరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles