Kings xi punjab vs kolkata knight riders preview

Kings XI Punjab, Kolkata Knight Riders, Robin Uthappa, Glenn Maxwell, Gautam Gambhir, IPL 2014, IPL 7, Indian Premier League

Kings XI Punjab locks horns with Kolkata Knight Riders in the first Qualifier clash of the IPL here on Tuesday.

వరణుడు కరుణిస్తేనే... తొలి క్వాలిఫయర్

Posted: 05/27/2014 12:45 PM IST
Kings xi punjab vs kolkata knight riders preview

ఐపీఎల్ సీజన్ - 7 తుది అంకానికి చేరుకుంది. లీగ్ దశను దాటి ప్లే ఆఫ్ కి చేరిన నాలుగు జట్లలో ఫైనల్ చేరే జట్లేమిటో తేల్చుకునేందుకు కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్ లు నేటి నుండి ప్రారంభం కాబోతున్నాయి. నేడు తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ లెవన్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది.

ఈ రెండు జట్లు ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాయి. పంజాబ్ జట్టు సీజన్ ఆరంభం నుండి దూకుడుగా ఆడటమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, కోల్ కత్తా జట్టు టోర్నీ ఆరంభంలో తడబాటుకు గురై, తరువాత వరుస విజయాలతో అదరగొట్టి ప్లే ఆఫ్ కి చేరుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి ఫైనల్‌పై కన్నేయగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ గతంలో ఒకసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరి ఈ రెండు జట్ల బలా బలాలు, వీక్ పాయింట్లు ఏమిటో చూద్దాం.

ఆది నుండి బ్యాటింగ్ లో అదరగొడుతున్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ ని కోల్ కత్తా సొంత గడ్డ పై ఆడబోతుంది. భీకర ఫామ్ లో ఉన్న మ్యాక్స్ వెల్, మిల్లర్ లు ఆరంభంలో అదరగొడుతుండగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ కూడా రాణిస్తుండం పంజాబ్ కి కలిసొచ్చే విషయం. ఇప్పటి వరకు లక్ష్య చేధనలో ఓడిపోలేదు.

అలా అని కోల్ కత్తాను తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. సొంత మైదానాన్ని, బౌలింగ్ నే నమ్ముకున్న కోల్ కత్తా ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ ఎకానమీ రేట్. నరైన్, మోర్కెల్ లాంటి వాళ్ళు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. ఆడేది తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కాబట్టి ఇందులో గెలిచిన జట్టు డైరెక్ట్ ఫైనల్ కి చేరుకోగా, ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో విజేతతో ఈ జట్టు మరోసారి పోటీ పడుతుంది.

పంజాబ్ - కోల్ కత్తాల ప్రతికూలాంశాలు...

మ్యాక్స్ వెల్ , సందీప్ శర్మలు గత కొన్ని మ్యాచ్ ల నుండి ఫాంలో లేకపోవడం పంజాబ్ కి మైనస్. కోల్ కత్తా పై మ్యాక్స్ వెల్ పెద్దగా రాణించక పోవడమే కాకుండా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. కోల్ కత్తా విషయానికి వస్తే... గత కొన్ని మ్యాచ్ ల నుండి ఉతప్ప అదరగొడుతున్నాడు. బ్యాటింగ్ లో ఈ జట్టు ఇతని పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. గత మ్యాచ్ లో మెరిసిన యూసుఫ్ పఠాన్ ఎప్పుడు రాణిస్తాడో తెలియని పరిస్థితి. బౌలింగ్ లో నరైన్ రాణిస్తే, ఉతప్ప మెరిస్తే తప్ప కోల్ కత్తాకు గెలుపు కష్టమే.

ఇంత వరకు బాగానే ఉన్నా, కోల్ కత్తాలో గత రెండు రోజల నుండి భారీ వర్షం కురిపిస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం వస్తూ, పోతూ అవాంతరం కలిగిస్తే కనీసం ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా సాధ్యం కాకపోతే ‘రిజర్వ్ డే ’ అయిన బుధవారం నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్‌రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకుంటుంది. సొంత మైదానం కావడంతో కోల్ కత్తా అభిమానులు వర్షం రావద్దని గట్టిగా కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles