Ipl 7 matches will be held in 3 countries

IPL 7, IPL 7 matches , IPL 7 matches , Indian Premier League 7, IPL 2014 news, IPL 7 matches will be held in 3 countries, UAE, India, Bangladesh, 2014 Indian Premier League.

IPL 7 matches will be held in 3 countries

మూడు దేశాల్లో ఐపిఎల్ 60 మ్యాచ్ లు

Posted: 03/15/2014 03:29 PM IST
Ipl 7 matches will be held in 3 countries

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై ప్రభావం చూపాయి. భద్రత కారణాల రీత్యా ఎన్నికల సమయంలో భారత్‌లో ఐపీఎల్‌ నిర్వహణకు అనుమతి లభించలేదు.

దీంతో పోటీలు మూడు దేశాల్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్‌ ఏడో అంచె పోటీలు ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 1 వరకు జరిపేందుకు నిర్ణయించగా, తొలి సగభాగం యూఏఈలో నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు పోటీలు అక్కడే ఉంటాయి.

రెండో సగభాగం పోటీలు మే 1 నుంచి 12 వరకు బంగ్లాదేశ్‌ లేదా భారత్‌లో ఉంటాయి. మే 13 నుంచి చివరి దశ పోరు భారత్‌లో జరగనుంది. ఇదిలావుండగా, ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో మే 1 తర్వాత ఐపీఎల్‌ పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

2009లో కూడా ఐపీఎల్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగిన దృష్టా్య భద్రతకారణాల రీత్యా పోటీలకు అనుమతివ్వలేదు. దీంతో దక్షిణాఫ్రికాలో పోటీలు నిర్వహించారు. భారత్‌లో నిర్వహించాలంటే తగిన భద్రత అవసరం. అందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉంది.

తొలి దశ పోటీలు యుఏఇలోని అబుధాబి, దుబాయ్‌, షార్జాలో (ఏప్రిల్‌ 16-30, మొత్తం 16 మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. తమకు మ్యాచ్‌లు నిర్వహిం చేందుకు అవకాశం ఇవ్వడంపట్ల ఎమిరేట్‌‌సకు బిసిసిఐ అభినందనలు తెలిపింది. రెండో దశ బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించినా వీలు ను బట్టి వీటిని భారత్‌లో ప్రభుత్వంనుంచి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే నిర్వహిస్తారు. 

మే 1 నుంచి 12 వరకు ఎన్నికలు లేనిచోట మ్యాచ్‌లు నిర్వహించేందుకు తమ అవకాశం ఇవ్వాలని హోంశాఖను బిసిసిఐ కోరింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతించకపోతే వాటిని బంగ్లాదేశ్‌లోనే నిర్వహిస్తారు.

ఇక ఆఖరి దశ లీగ్‌ పోటీలు మా త్రం మే 13 నుంచి భారత్‌లోనే నిర్వహించనున్నారు. అప్పటికి అన్నిరాష్ట్రాల్లో పోలింగ్‌ ముగుస్తోంది. అలాగే మే 16 న కౌంటింగ్‌ ఉన్నందున ఆ రోజు న మాత్రం ఎక్కడా మ్యాచ్‌లు నిర్వహించరు.

ఈసారి కూడా జట్లు తక్కువగా ఉన్నందున మొత్తం 47రోజుల పాటు 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.అదే గత సీజన్‌లో 54 రోజుల పాటు నిర్వహించి 76 మ్యాచ్‌లు నిర్వహించిన విషయం తెలిసిందే.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles