Ipl 7 to be held from april 16 first half goes to uae

IPL 7, IPL-7 schedule, Ranjib Biswal, IPL 7 venues, April 16, IPL 7 matches, BCCI official Ranjib Biswal, bcci, 2014 election.

IPL 7 to be held from April 16-first half goes to UAE, IPL 7 venues to be decided in three days: Ranjib Biswal

‘మోగిన’ ఐపిఎల్-7 పరుగుల పండుగ?

Posted: 03/13/2014 10:47 AM IST
Ipl 7 to be held from april 16 first half goes to uae

ఐపిఎల్-7వ ఎడిషన్ షెడ్యూల్‌ను బిసిసిఐ ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 16 నుంచి జూన్ 1వ తేదీ వరకూ ఈ టి20 క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా, భారత్‌లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 16 నుంచి 30 మధ్య యుఎఇలోను, ఆ తరువాత మే 1 నుంచి 12 వరకూ బంగ్లాదేశ్ లేదా భారత్‌లోను ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తారు.

అనంతరం మే 13 నుంచి జూన్ 1వ వరకూ చివరి దశ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. అయితే మే 1వ తేదీ లోగా ఎన్నికలు పూర్తయిన చోట్ల ఐపిఎల్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి బిసిసిఐ విజ్ఞప్తి చేసింది.

"2014 పెప్సీ ఐపిఎల్" టోర్నమెంట్ తొలి విడత మ్యాచ్‌లు యుఎఇలోని అబుదాబీ, దుబాయ్, షార్జాలో జరుగుతాయని బోర్డు సెక్రెటరీ సంజయ్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకూ కనీసం 16 మ్యాచ్‌లు యుఎఇలోనే జరుగుతాయంటూ అక్కడి ప్రభుత్వానికి, దేశ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ కృతజ్ఞతలు తెలిపింది.

ఇక మే 1వ తేదీ నుంచి 12 తేదీ వరకూ నిర్వహించే మ్యాచ్‌లను భారత్‌లో ఎన్నికలు ముగిసిన నగరాల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతి కోసం హోం మంత్రిత్వశాఖను సంప్రదించినట్లు బిసిసిఐ ప్రకటన తెలిపింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి భారత్ లేదా బంగ్లాదేశ్‌లలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయని బోర్డు పేర్కొంది. కాగా, మే 13 నుంచి జరిగే చివరి దశ మ్యాచ్‌ల విషయంలో అయోమయానికి ఆస్కారం లేదంటూ ఎన్నికల కౌంటింగ్ జరిగే మే 16న మ్యాచ్‌లు ఏవీ ఉండవని స్పష్టం చేసింది.

భారత్‌లో ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకూ తొమ్మిది దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున ఐపిఎల్‌కు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇంతకు ముందు 2009లో ఈ మొత్తం టోర్నీని దక్షిణాఫ్రికాకు మార్చిన సంగతి తెలిసిందే.

"2014 పెప్సీ ఐపిఎల్" టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటుండగా 47 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్ షెడ్యూల్‌ను ఖరారు చేసే క్రమంలో హోంమంత్రిత్వశాఖతో బిసిసిఐ అధికారులు, ఐపిఎల్ ఛైర్మన్ రంజీబ్ బిస్వాల్ కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారు.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles