Injured dhoni ruled out of asia cup

captain ms dhoni, cricket, india, ms dhoni, new zealand, virat kohli, Pakistan, Sri Lanka, Bangladesh, Afghanistan, Asia Cup

Away from home, Dhoni has captained India in 23 Tests, of which they have won five, lost 11 and drawn seven.

ఆసియా కప్ నుండి ధోని తప్పుకున్నాడు

Posted: 02/21/2014 12:01 PM IST
Injured dhoni ruled out of asia cup

విదేశాల్లో జట్టును నడిపించడంలో ఘోరంగా విఫలం అయిన ధోని పై మాజీలు తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా, అతన్ని నాయకత్వం నుండి తప్పించడానికి ఇదే సరైన సమయం అని చెబుతున్న సమయంలో ధోనీనే స్వచ్చందంగా తప్పుకున్నాడు. కానీ కెప్టెన్సీ నుండి కాదు. ఆసియా కప్ నుండి. వన్డేల్లో మ్యాచ్ విన్నర్ గా పేరొందిన ధోని న్యూజిలాండ్ లో సిరీస్ లో రెండో టెస్టులో ఎడమ పక్కటెముకల్లో గాయం అయ్యింది. దీంతో అతను ఆసియా కప్ కి దూరంగా ఉండబోతున్నాడు.

అతనికి డాక్టర్లు పది రోజుల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో టోర్నీకి దూరం అయ్యాడు. ఇతని స్థానంలో జట్టు కెప్టెన్సీ పగ్గాలు కోహ్లీకి అప్పగించారు సెలక్టర్లు. ధోని స్థానంలో దినేష్ కార్తీక్ ను ఎంపిక చేసింది. ఇక ఈ నెల 25 నుంచి మార్చి 8 వరకు బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియాకప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ పాల్గొంటున్నాయి.

26న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా టోర్నీని మొదలు పెడుతుంది. 28న శ్రీలంకతో, మార్చి 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, 5న అఫ్ఘానిస్తాన్‌తో తలపడుతుంది. ధోని స్థానంలో భారత జట్టు పగ్గాలు చేపట్టడం విరాట్ కోహ్లికిది మూడోసారి. ఆసియా కప్ గెలిచి తన నాయకత్వ ప్రతిభను కూడా చాటుకొని భవిష్యత్తు కెప్టెన్ అనిపించుకుంటాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles