Sania mirza not participating in aisa games due to atp wta tournaments

sania mirza, sania mirza latest news, sania mirza asia games, asia games 2014, telangana brand ambassador, telangana cm kcr, kcr latest news, sania mirza rewared by telangana

sania mirza not participating in aisa games due to atp wta tournaments

కోటి రూపాయలు దొబ్బేసింది.. అడ్రస్ లేకుండా పోయింది!

Posted: 09/11/2014 03:04 PM IST
Sania mirza not participating in aisa games due to atp wta tournaments

ఇటీవలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా యూఎస్ ఓపెన్ డబుల్స్ లో ఘనవిజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. తన విజయాన్ని తెలంగాణాకు అంకితం చేస్తున్నానని ప్రకటించింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈమె విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ.. మరోసారి సన్మానించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై సానియా, కేసీఆర్ మంగళవారం కలుసుకున్నారు కూడా! దీంతో ఈ అమ్మడికి మళ్లీ కోటి రూపాయల బహుమానం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మునుపటికంటే ఘనంగా ఈ అమ్మడిని సన్మానించే సన్నాహాలు తెలంగాణప్రభుత్వం చేస్టున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. ఈ అమ్మడు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు అడ్రస్ లేకుండా దూరంగా వెళ్లిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఇండియాన్ లో జరుగుతున్న ఈ క్రీడలకు ఇప్పటికే మన దేశం నుంచి సీనియర్ ఆటగాళ్లయిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, లియాండర్ పేస్, రోహన్ బోపన్న తదితర ఆటగాళ్లు పాల్గొనలేమని ప్రకటించిన క్రమంలో.. ఈ అమ్మడు తప్పుకుంటున్నట్లు తేలిపోయింది. అయితే ఈ ఆసియా క్రీడలు జరుగుతున్న సమయంలోనే ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నమెంట్లు జరుగుతున్న కారణంతోనే వీళ్లంతా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడిస్తున్నారు.

అంతర్జాతీయ ఈవెంట్ లో పాల్గొనకపోతే విలువైన పాయింట్లతోపాటు ఆర్థికంగా నష్టం చేకూరుతుండటంతో వీరంత ఈ ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు దూరమవుతున్నారు. ఈమేరకు పేస్, బోపన్న, సానియా మీర్జా తదితర ఆటగాళ్లు తమను ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాల్సిందిగా అఖిల బారత టెన్నిస్ సంఘం (ఐటా)కు అనుమతి కోరారు. దీంతో ఆ సంఘం ఆగాళ్ల విజ్ఞప్తిని మన్నించి.. వారిని ఆ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించింది. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో పాల్గొనాలంటే వారు తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఐటా అధ్యక్షుడు అనిల్ ఖన్నా కూడా తెలిపారు.

అయితే ఆసియా క్రీడల్లో పాల్గొనే నిర్ణయాన్ని సానియా మీర్జా ‘ఐటా’ సంఘానికి వదిలేసింది. దీంతో ఆ సంఘం ఈమెను ఆసియా క్రీడల నుంచి తప్పించి... ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ఒకేసారి సీనియర్ ఆటగాళ్లందరూ ఈ ప్రతిష్టాత్మక క్రీడల నుంచి తప్పించుకోవడంతో వారి స్థానంలో అప్పటికప్పుడే ఇతర ఆటగాళ్లను ఎంపిక చేయలేక యువ ఆటగాళ్లయిన బాంబ్రీ, సనమ్ సింగ్, సాకేత్ మైనేని, దివిజ్ శరణ్ లపై భారత్ పతకాల ఆశలు పెట్టుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలోనే సానియా మీర్జా ఆసియా క్రీడల నుంచి విశ్రాంతి తీసుకోబోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  telangana brand ambassador  kcr  asia games  world tournaments  

Other Articles