Sharapova dumped out of aussie open

Sharapova out, Serena Williams, Dominika Cibulkova tennis,tennis News, Australian Open, Maria Sharapova

Maria Sharapova following Serena Williams out of the Australian Open in the second upset in 24 hours.

రష్యా భామ కథ కంచికి చేరింది

Posted: 01/21/2014 10:43 AM IST
Sharapova dumped out of aussie open

కొత్త సంవత్సరంలో ప్రారంభం అయిన తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన టాప్ సీడెడ్ ఆటగాళ్ళకు ఈ టోర్నీ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఏ మాత్రం అంచనాలు లేని ఆటగాళ్ళు టాప్ సీడ్ ఆటగాళ్ళను మట్టి కరిపిస్తూ సంచలనాలు రేకెత్తిస్తున్నారు.

ఆదివారం నల్ల కలువ భామ సెరెనా విలియమ్స్ ఓటమిని మరచిపోక ముందే మరో టాప్ సీడ్ భామ షరపోవా స్లొవేకియా క్రీడాకారిణి సిబుల్కోవా ధాటికి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్ర్కమించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 20వ సీడ్ డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 3-6, 6-4, 6-1 తో షరపోవాను బోల్తా కొట్టించి తన కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

నిర్ణాయక మూడో సెట్‌లో సిబుల్కోవా హడలెత్తించి షరపోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సంచలన విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ముందు ముందు ఇంకెన్ని సంచనాలు జరుగుతాయో అని టెన్నిస్ ప్రియులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles