ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రంలో తన అత్తను మెప్పించి, ఆమెను తన తండ్రి వద్దకు వచ్చేలా చేస్తాడు. అది రీల్ లైఫ్ లో. కానీ ఇక్కడ క్రికెట్ దేవుడు సచిన్ రియల్ లైఫ్ లో తనకు పిల్లనిచ్చిన అత్తతో మెప్పు (ప్రశంసలు) పొందాడు. త్వరలో క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్న సచిన్ గురించి కొన్ని విషయాలు తెలిపింది అతని అత్త అనాబెల్ మెహతా. 40 ఏళ్ళుగా తను నడిపిస్తున్న ‘ఆప్నాలయా ’ స్వచ్చందకు అన్నీ తానై చూసుకున్నాడని, ముఖ్యంగా ముంబై మురికి వాడల్లోని చిన్నారుల విద్య కోసం తన అల్లుడు పరితపించాడని తెలిపారు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ స్మారకార్థం విద్యార్థులకు చక్కని సదుపాయాలు కల్పించాడని మెహతా చెప్పారు.
‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో సచిన్ ఒకడు. ఇందులో సందేహమే లేదు. సమున్నత వ్యక్తిత్వంలోనూ అతనికి అతనే సాటి. తన తండ్రి మార్గదర్శనమో, లేక ప్రభావమో గానీ... టెండూల్కర్ కుటుంబానికి ఎంతో విలువిస్తాడు, అవసరమైతే సమాజానికి అండగా నిలవాలనుకుంటాడు ’ అని ఆకాశానికెత్తేసింది. సచిన్ రిటైర్మెంట్‌ను తమ అప్నాలయా చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ ఎంత మందికి ఆదర్శవంతుడో, సమాజంలో లో కూడా అంతే ఆర్శవంతంగా నిలిచాడని చెప్పవచ్చు.
ఇక వచ్చే నెలలో విండీస్ తో ఈడెన్ గార్డెన్ లో చివరి టెస్టు ఆడబోతున్న సచిన్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం క్యాబ్ ఘనంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆ రోజు సచిన్ ఈడెన్ లో అడుగు పెట్టడోతున్నప్పుడు అతని మాస్క్ లు ధరించిన 80 వేల మందితో స్వాగతం పలకాలని నిర్ణయించింది. అంతే కాకుండా స్టేడియం పై కప్పున అతని ముఖ చిత్రంతో కూడిన బెలూన్లు, ప్రేక్షకులను టీ షర్టులను కూడా పంపిణి చేయాలని భావిస్తుంది. ఇంత వరకు భాగానే ఉన్నా అభిమానుల కోసం మాత్రం 5 వేల టిక్కెట్లనే కేటాయించింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more