ఈ ఏడాది కేలండర్ లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ లో ఫ్రీ క్వార్టర్స్ లో నిష్ర్కమించి అందిరికి షాక్ ఇచ్చిన ఫెడక్స్ కెరియర్ చివరి దశకు చేరుకుందా ? ఇప్పటి వరకు ఏ ఆటగాడు సాధించలేనన్ని గ్రాండ్ స్లామ్ లు సాధించి నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగిన ఈ స్విస్ దిగ్గజం టెన్నిస్ నుండి తప్పుకోక తప్పదా అంటే గత కొన్ని గణాంకాలను చూస్తే ఇక తప్పదనే అనిపిస్తుంది. 2004 నుంచి 2008 వరకు వరసగా ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి 2009లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ ఈసారి నాలుగో రౌండ్‌లోనే ఓడిపోయాడు. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫెడరర్ ఓడిపోయిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి అతను ఓడిన విధానం చూశాక ఫెడరర్ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందనే అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది ఫెడరర్ ఒకే ఒక్క ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. అతని కెరీర్‌లో ఇలా జరగడం 2001 తర్వాత ఇదే తొలిసారి. ప్రతి సారి రాకెట్ వేగంలా దూసుకుపోయే అతడిలో వేగం తగ్గింది. మొన్నటి మ్యాచ్ లో ఓడిన అనంతరం ఈ స్విస్ ఆటగాడిని ఉద్దేశించి, ప్రముఖ ఆటగాడు అయిన మెకన్రో నోటి నుండి... ఎంత మంది అగ్రశ్రేణి ఆటగాళ్ళను మట్టికరిపించిన ఫెదరర్ నేనా నేను చూసేది అని వ్యాఖ్యానించాడు. ఇతని ఆట తీరు పై అతని ఒక్కడి అప్రాయమే కాదు ప్రపంచంలో ఉన్న టెన్నిస్ అభిమానులది కూడా. 302 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడితే వరుసగా 57 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన తొలి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టిస్తాడు. అంతటి ఆటగాడు ఇలాంటి ఆటను ప్రదర్శిస్తే సగటు అభిమానికి అలాంటి అనుమానాలు రావడం సహజమేనేమో ?
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more