గత ఐదు సీజన్లలో నిరాశ పరిచిన హైదరాబాద్ ఐపీఎల్ జట్టు ఈసారి యాజమాన్యంతో పాటు, పేరు మార్చుకొని బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే పేరు మారడంతో ఈ జట్టు గీత కూడా కాస్తంత మారినట్లే అనిపిస్తుంది. ఆరో సీజన్ లో నిన్న రాత్రి పూణే వారియర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. గతంలో ఈ జట్టు భారీ స్కోరు చేసినా ఓటములను చవిచూసింది. కానీ నిన్నటి మ్యాచ్ లో చేసింది తక్కువ స్కోరు అయినా బౌలింగ్ లో రాణించింది. పూణే వారియర్స్ ఇండియా జట్టుపై 22 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టును పూణే వారియర్స్ 126 పరుగులకే కట్టడి చేయగలిగింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ బ్యాటింగ్‌లో ప్రతిభ చూపకపోవడంతో పూణే జట్టు 18.5 ఓవర్లకు 104 పరుగులు చేసి ఆలౌట్ అయి ఓటమిపాలైంది. మిశ్రా (3/19), స్టెయిన్ (3/11), పెరీరా (2/29) బౌలింగ్ ముందు వారియర్స్ తలవంచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో పెరీరా (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్షత్ రెడ్డి (30 బంతుల్లో 27; 2 ఫోర్లు) తప్ప మిగతా వారు పెద్దగా రాణించలేకపోయారు. పూణే జట్టులో ఉతప్ప (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఎవరూ పెద్దగా స్కోర్లు చేయలేక ఓటమి పాలయ్యారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more