బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు లిస్ట్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్, పేసర్ ఇషాంత్ శర్మ 'బి' గ్రేడ్‌కు దిగజారారు. అనిల్ కుంబ్లే రిటైర్‌మెంట్ అనంతరం జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా రాణిస్తున్న హర్భజన్‌తో పాటు గాయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఇషాంత్ 'ఎ' గ్రేడ్‌లో క్రికెటర్ల జాబితాలో స్థానం దక్కక పోగా, గత నవంబర్‌లో తొలి టెస్టు ఆడిన అశ్విన్ ఇప్పటికి మొత్తం 8 టెస్టుల్లో 49 వికెట్లతో రాణించి 'ఎ' గ్రేడ్ దక్కించుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 18 వికెట్లు తీయడంతోపాటు 40 వన్డేల్లో 56 వికెట్లు, 20 వన్డేల్లో 12 వికెట్లతో రాణించిన అశ్విన్ ఒక్కడికే కొత్తగా 'ఎ' గ్రేడ్‌లో స్థానం లభించడం విశేషం. కాగా, ద్రావిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్ అనంతరం ఏడాదికి రు.కోటి లభించే ఈ జాబితాలో వెటరన్స్ సచిన్, ధోనీ, సెహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్‌లతో పాటు విరాట్ కోహ్లీ, రైనా, యువరాజ్ స్థానం దక్కించుకోగా, రు. 50 లక్షల మొత్తం లభించే 'బి' గ్రేడ్‌లో హర్భజన్, ఇషాంత్‌లతో పాటు రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, ఛటేశ్వర్ పూజారా, అజింక్య రహానే, ఇర్ఫాన్ పఠాన్, ఉమేష్ యాదవ్, 'సి' గ్రేడ్‌లో రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, వినరు కుమార్, మునాఫ్ పటేల్, అభిమన్యు మిథున్, మురళీ విజరు, శిఖర్ ధవాన్, వృద్ధిమాన్ సాహా, పార్దివ్ పటేల్, మనోజ్ తివారీ, బద్రీనాథ్, పీయుష్ చావ్లా, దినేష్ కార్తిక్, రాహుల్ శర్మ, వరుణ్ ఆరాన్, అభినవ్ ముకుంద్, అశోక్ ధిండా, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, బాలాజీలకు చోటు లభించింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more