భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఇప్పట్లో కెప్టెన్ బాధ్యతలు అప్పగించొద్దని పాక్ మాజీ కెప్టెన్ వాసిమ్ అక్రం అభిప్రాయపడ్డాడు. 'పరిమిత ఓవర్లలో కెప్టెన్సీ చెప్పట్టడానికి అతడు ఇంకొన్ని రోజులు వేచి ఉండాలి. గత 18 నెలలుగా కోహ్లీ భారత్‌కు నమ్మదగ్గ బ్యాట్స్ మన్‌గా ఉన్నాడు. అతడిని ఆటను ఆస్వాదించనివ్వాలి. ఈ సమయంలో అదనపు బాధ్యతలు అప్పగించి అతడిపై భారం మోపొద్దు. టీమ్ సెలక్షన్ విషయాలు, మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అతడికి భారమే.' అని అక్రమ్ పేర్కొన్నాడు. కెప్టెన్ ధోనీకి అక్రమ్ బాసటగా నిలిచాడు. ధోనీ కెప్టెన్సీ సామర్ధ్యంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చాడు.
ఇటీవల టి20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్ చేరడంలో విఫలం కావడంతో ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ధోనీ నాయకత్వ లక్షణాలపై తనకు నమ్మకముందని అక్రమ్ తెలిపాడు. అయితే ధోనీ ఏదైన ఒక ఫార్మట్‌లో కెప్టెన్సీ వదులుకోవాలన్నాడు. అప్పుడే 31 ఏళ్ల ధోనీ ఆటను ఆస్వాదించగలడని పేర్కొన్నాడు. తన కెప్టెన్సీపై పున:సమీక్షించుకోవడానికి అతడికి కొంత సమయం ఇవ్వాలన్నాడు. ధోనీ తన కెప్టెన్సీకి తగిన న్యాయం చేస్తున్నాడని తెలిపాడు. అయితే మూడు ఫార్మట్లకు న్యాయకత్వం వహిచడమే అతడిపై అదనపు ఒత్తిడి పెంచుతోందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్ అని ప్రశంసించాడు. ఐసిసి టి20 ప్రపంచ కప్‌లో విఫలమైన గౌతమ్ గంభీర్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడు తిరిగి ఆత్మవిశ్వాసం పొందడానికి మరికొన్ని మ్యాచ్‌లు అవసరం అన్నాడు.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more