టీమిండియా సూపర్-8లో ఈ రాత్రి ఆసీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కంగారూలు భారత్‌పై షార్ట్‌పిచ్ అస్త్రాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరో పక్క ఆసీస్‌ను తిప్పేయాడానికి టీమిండియా రెడీగా ఉంది.
టి20ల్లో ఆసీస్‌పై భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇరు జట్లు గతంలో ఆరుసార్లు తలపడగా చెరి మూడు విజయాలు సాధించారు. టి20 ప్రపంచ కప్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఒక మ్యాచ్‌లో ఓడింది. బ్యాటింగ్‌లో గంభీర్ టచ్‌లోకి రావడం భారత్‌కు శుభ శూచకం. విన్నింగ్ జట్టును కొనసాగించడానికే భారత మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తోంది. ఓపెనర్ సెహ్వాగ్ తుది జట్టులో చోటు దక్కించుకునేది కొంత అనుమానంగా ఉంది. జట్టు కూర్పులో కెప్టెన్ ధోనీకి పెద్ద చిక్కొచ్చి పడింది. తుది జట్టుకు డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లలో ఎవరిని ఎంపిక చేయాలో ధోనీకి ఎటూ పాలు పోవడం లేదు. తన కెరీర్‌లో ఇదే అతి పెద్ద సవాల్‌గా మారిందని ధోనీ వ్యాఖ్యానించాడు. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక పోతున్నానన్నాడు. ఒక వేళ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఏ కాంబినేషన్ బరిలోకి దిగుతుందో చెప్పలేనన్నాడు. గ్రూప్ మ్యాచ్‌ల్లో వరుసగా ఐర్లాండ్, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించి ఆసీస్ జోరు మీదుంది. టాప్ ఆర్డర్‌లో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో స్టార్క్, మేక్‌కే, క్రిస్టియన్‌లు మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ మ్యాచ్ ఆసీస్ పేస్‌కు భారత స్పిన్‌కు మధ్య పోటీగా మారనుంది.
భారత్ : ధోనీ (కెప్టెన్), గంభీర్, అశ్విన్, బాలాజీ, చావ్లా, అశోక్ దిండా, హర్భజన్, జహీర్, విరాట్ కోహ్లీ, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనా, సెహ్వాగ్, రోహిత్ శర్మ, మనోజ్ తివారి, యువరాజ్ సింగ్.
ఆసీస్ : జార్జ్ బెయిలీ (కెప్టెన్), డాన్ క్రిస్టియన్, కమిన్స్, క్షేవియర్ డోహార్టి, బెన్ హిల్ఫెనాస్, బ్రాడ్ హాగ్, డేవిడ్ హస్సీ, మైఖెల్ హస్సీ, మ్యాక్స్‌వెల్, క్లింట్ మెక్‌కే, మిచెల్ స్టార్క్, మాథ్యూస్ వాడే, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, కామెరున్ వైట్.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more