బ్రిటన్ స్విమ్మర్ మాథ్యూ వాటర్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయల్ ఎస్-7 విభాగంలో కాంస్య పతకం సాధించాడు. పతకాన్ని అందుకున్న ఆనందం కంటే తండ్రి కోసం తాను అనుకున్నది సాధించానన్న సంతోషం అతనిలో స్పష్టంగా కనిపించింది. లండన్ పారాలింపిక్స్ ప్రారంభానికి కొద్ది వారాల క్రితమే మాథ్యూ తండ్రి అలాన్ వాకర్ మృతి చెందాడు. మాథ్యూ పారాలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధిస్తే చూడాలని అతను ఆశించాడు. కానీ, పారాలింపిక్స్ మొదలుకాక ముందే మృత్యు ఒడిని చేరాడు. అయతే, తండ్రి కలను నియం చేయాలన్న పట్టుదల పెరిగింది. సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించాడు. చివరికి కాంస్య పతకాన్ని దక్కించుకోగలిగాడు. అవార్డుల ప్రదానం సమయంలో తన తండ్రి ఫొటోను ఓ చేత్తో పట్టుకొని ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఉత్తర కొరియా స్విమ్మర్ రమ్ జూ సాంగ్ పురుషుల 50 మీటర్ల ఎస్-6 ఫ్రీస్టయిల్‌లో చివరి స్థానంలో నిలిచినా, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆరేళ్ల ప్రాయంలోనే ఒక భవన నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఒక చేయి, ఒక కాలు కోల్పోయిన 16 ఏళ్ల సాంగ్ లండన్ పారాలిపింక్స్‌కు వైల్డ్‌కార్డ్‌పై ఎంట్రీ సంపాదించాడు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో స్విమ్మర్‌గా ఎదుగుతున్న అతనికి అభిమానులు జేజేలు పలికారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more