ప్రతిష్ఠాకరమైన పద్మ భూషణ్ అవార్డుకు భారత క్రికెట్ జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్, పద్మశ్రీ అవార్డుకు ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరును సిఫార్సు చేయాలని భారత క్రికెట్ కంట్రో ల్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్, కార్యదర్శి సంజయ్ జగ్దలె ఈ అంశంపై చర్చించి, ప్రభుత్వానికి పేర్లను పంపను న్నారని బోర్డు అధికారి ఒకరు సోమ వారం తెలియజేశారు. ‘ద్రవిడ్, గంభీర్ పేర్లపై ఇంతకు ముందు చర్చ జరిగింది. అధ్యక్షుడు, కార్యదర్శి ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేది ఆగస్టు 15. పేర్లను పంపడమైంది’ అని ఆయన తెలిపారు. వాస్తవానికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం ద్రవిడ్ పేరు ఇదివరకే పరిశీలన లో ఉంది.
ద్రవిడ్ 24 వేల కు పైగా అంతర్జాతీయ పరుగులు స్కోర్ చేశాడు. అతను 134 టెస్ట్‌లలో 13 వేల పైచిలుకు పరుగులు,344 ఒడిఐలలో సుమారు 11 వేల పరు గులు స్కోర్ చేశాడు. అతని ఖాతాలో 36 టెస్ట్ సెంచరీలు,12 ఒడిఐ సెంచరీలు ఉన్నాయి. ఇక మూడు రకాల క్రికెట్‌లో పరుగుల వరద పారి స్తున్న గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవా ర్డుకు అర్హుడు. అతను ఇప్పటికే అర్జున అవార్డు గ్రహీత. క్రితం సంవత్స రం ప్రపంచ కప్ ఫైనల్‌లో గంభీర్ సాధిం చిన 97 పరుగుల స్కోర్ అతని అర్హతకు మరింత బలం చేకూరుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more