గత నాలుగైదు రోజులుగా అందరినీ వేధిస్తున్న సస్పెన్స్‌కు తెరపడింది. లండన్ ఒలింపిక్స్‌లో తాను ఆడనున్నట్టు వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ ప్రకటించడంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) ఊపిరి పీల్చుకుంది. ఈ మెగా టోర్నీకి పేస్ భాగస్వామిగతా తొలుత మహేష్ భూపతిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, పేస్‌తో కలిసి ఆడేందుకు భూపతి నిరాకరించడంతో వివాదం చెలరేగింది. సుమారు ఏడాది కాలంగా రోహన్ బొపన్న తన డబుల్స్ భాగస్వామిగా ఉన్నాడని, అతనిని కాదని పేస్‌కు జోడీగా వెళ్లాలనడంలో అర్థం లేదని భూపతి వాదించాడు. ఎఐటిఎ తన నిర్ణయం మార్చుకోకపోతే ఒలింపిక్స్ నుంచి వైదొలగుతానని ప్రకటించాడు. బొపన్న కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేస్‌కు జోడీగా విష్ణువర్ధన్‌ను ఎఐటిఎ ప్రకటించింది. డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పేస్ ఏడో స్థానంలో ఉంటే, విష్ణువర్ధన్‌ది 206వ స్థానం. భూపతి ఒత్తిళ్లకు ఎఐటిఎ తలవంచిందని, అంతర్జాతీయ పోటీల్లో పెద్దగా అనుభవం లేని ఆటగాడిని తనకు పార్ట్‌నర్‌గా ఎంపిక చేసిందని పేస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి.
తీవ్ర మనస్థాపానికి గురైన అతను ఒలింపిక్స్‌లో ఆడరాదని నిర్ణయించినట్టు మీడియాలో కథనాలు రావడంతో ఎఐటిఎతోపాటు అభిమానులు కూడా ఆందోళన చెందారు. పేస్ ఒలింపిక్స్‌లో ఆడతాడా లేదా అన్న అనుమానం ప్రతి ఒక్కరినీ వేధించింది. అతని నిర్ణయం ఎలావుంటుందోనన్న సస్పెన్స్ నెలకొంది. అయితే, తాను ఒలింపిక్స్‌లో పాల్గొంటానని పేస్ ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అందుకే ఎఐటిఎ ఎంపిక చేసిన భాగస్వామితో కలిసి ఆడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేస్ స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more