సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సెకండ్ సీజన్లో టాలీవుడ్ టీమ్ న్యూజెన్ తెలుగు వారియర్స్ అదరగొడుతోంది. బెంగళూర్‌లో జరిగిన మ్యాచ్‌లో వారియర్స్ 9 వికెట్ల తేడాతో కేరళ స్ట్రైకర్స్‌పై ఘనవిజయం సాధించింది. టోర్నీలో వెంకీ గ్యాంగ్‌కు ఇది వరుసగా రెండో విజయం. టాస్ గెలిచిన వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేరళ ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినప్పటకీ ఐదో ఓవర్ నుండీ టాలీవుడ్ టీమ్ బౌలర్లు వారిని కట్టడి చేశారు. ముఖ్యంగా బౌలర్ నంద కిషోర్ , ఆల్‌రౌండర్ చరణ్‌తేజ్ వరుస వికెట్లు తీసి స్ట్రైకర్స్‌ను కుప్పకూల్చారు. దీంతో కేరళ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 94 పరుగులు చేసింది. నందకిషోర్ 4 , చరణ్‌తేజ్ 3 వికెట్లు తీసుకున్నారు. 95 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వారియర్స్ ఆరంభం నుండే అదరగొట్టింది. ఓపెనర్ తారకరత్న త్వరగానే ఔటైనప్పటకీ... మరో ఓపెనర్ ఆదర్శ్ , తరుణ్ జట్టును గెలిపించారు. ఆదర్శ్ బౌండరీ కొట్టి జట్టుకు విజయాన్నందించడంతో పాటు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తరుణ్ 27 , ఆదర్శ్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో తెలుగు వారియర్స్ ఫైనల్‌కు చేరువైంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్‌ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more