జూనియర్ ఎన్టీఆర్
‘యంగ్ టైగర్’గా పేరొందిన ఈ నందమూరి వారసుడు.. ప్రముఖ సినీనటుడు హరికృష్ణ, షాలిని దంపతులకు 1983 మే 20వ తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. 1996లో ‘రామాయణం’ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా రంగప్రవేశం చేసిన ఈ హీరోకి ‘స్టూడెంట్ నం.1’ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.