i want to live seperately from my husband without taking divorce

How can i live seperate without divorce from my husband

my livelyhood, domestic harrasment against women, sexual harrasment against women, women, old age, judicial seperation, have all right on husbands assests, divorce, live seperately, wife and husband, wife and husband relationship, 25 years of my marriage life, relationship with young girls, husband, wife, harrassment, councelling, legal advice advice

my husband is harrassing me after 25 years of my marriage life, he want to have relationship with young girls

భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..?

Posted: 06/24/2015 05:07 PM IST
How can i live seperate without divorce from my husband

భర్త నుంచి విడాకులు పోందకుండా సెపరేట్ గా వుండటం సాధ్యమేనా..? ఈ ప్రశ్న ఉదయించింది కొత్తగా ఫెళ్లైన యువ జంటలో కాదు. పాతికేళ్లు భర్తతో కలసి సంసారం చేసిన ఓ భార్య మదిలో.. ఇన్నాళ్ల పాటు అమెతో అన్ని చాకిరీలు చేయించుకుని,. తన పిల్లలకు కూడా బండెడు చాకిరీ చేసి.. పెంచి పెద్ద చేసి. సద్గుణాలను నేర్పించి.. ఓ తల్లి తన భర్త నుంచి ఎందుకు దూరంగా వుండాలని కోరుకుంటుంది. అమె మాట్లల్లోనే.. మా పెళ్లయ్యి పాతికేళ్లు గడించింది. మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. మా వారు బ్యాంక్ మేనేజర్, ఇటీవలే విఆర్ఎస్ తీకున్నారు.

నా పెళ్లైన నాటి నుంచి నా ఆరోగ్యం కూడా లక్ష్యపెట్టకుండా.. అవిశ్రాంతంగా భర్త పిల్లలకోసం శ్రమించినా.. నన్ను ఏనాడు మావారు గుర్తించలేదు.. సరికదా మనిషిగా కూడా పరిగణించలేదు. అయినా నేను బాధపడకుండా.. పిల్లల అభ్యున్నతి కోసం ఆయన పెట్టిన చిత్రహింసలన్నింటినీ భరించాను. గత కోంత కాలంగా ఆయన నన్ను ముసలిదానివయ్యావని ఎగతాళి చేస్తున్నారు. అంతేకాదు తాను ఇంకా ఫిట్ గా వున్నానని, ఈ వయస్సులో కూడా తనంటే అమ్మాయిలు పడి చస్తున్నారని సూటిపోటి మాటలతో నన్ను తీవ్ర మానసిక ఒత్తడికి గురిచేస్తున్నారు. వీఆర్ఎస్ తీసుకున్న తరువాత ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పును నేను భరించలేకపోతున్నాను. ఆయన నుంచి దూరంగా వుండేందుకు నాకు ఏదైనా మంచి సలహా ఇవ్వండి.

ఇన్నేళ్ల దాంపత్య జీవితం తరువాత కూడా మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం.. మీ ఇష్టాఇష్టాలను తెలుసుకోకపోవడం బాధకరమే. కనీసం మనిషిగా కూడా మిమల్ని పరిగణించలేదంటే.. మీ బాద వర్ణణాతీతం. అయితే ఇన్నేళ్ల తరువాత మీ రు మీ భర్త నుంచి విడాకులు పోందగలిగిలే..వచ్చే లాభం శూన్యం. మీ భర్తపై కేసు పెట్టడం కూడా సమస్యకు పరిష్కారం కాదు. అయితే మీ భర్త మానసిక వేధింపుల నుంచి తప్పించుకుని ప్రశాంతంగా వుండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు మీ కారణాలన్నింటినీ వివరిస్తూ,, ఫ్యామిలీ కోర్టులో జేడీషియల్ సెపరేషన్ కోరుతూ పిటీషన్ దాఖలు చేయండి.

 సెక్షన్ 10, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మీ భర్త నుంచి మీరు విడాకులు తీసుకోకుండానే విడిగా వుండే అవకాశన్ని న్యాయస్థానం మీకు కల్పిస్తుంది. ఇందువల్ల మీ వివాహ బంధం రద్దు కాదు, పైపెచ్చు మీ భర్త అస్తి హక్కులు మీకు సంక్రమించడంలో ఏ ముప్పూ వాటిల్లదు. కేవలం శారీరిక సంబంధాలు మాత్రమే రద్దు అవుతాయి. ఇద్దరు కలసి జీవించే హక్కును తాత్కాలికంగా న్యాయస్థానం రద్దు చేస్తుంది. మీ భర్త లేదా అతడితో దూరంగా వున్న మీరు పునరాలోచించుకుని లోటుపాట్లను సవరించుకుని మళ్లి కలసి వుండాలని కూడా న్యాయస్థానం అవకాశం కల్పిస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : husband  wife  harrassment  councelling  legal advice advice  

Other Articles