నార్వే లో ఉద్యోగం చేసుకోవచ్చంటూ వెళ్లిన భాగ్యనగర దంపతులకు ఓ విచిత్రమైన అనుభూతి ఎదురైంది. అల్లరి చేయొద్దంటూ తమ కుమారుడిని మందలించిన పాపానికి నార్వే దేశంలో కటకటాలు లెక్కిస్తున్నారు. నార్వే ప్రభుత్వ విద్యాలయం నియమావళి వారిపాలిట శపంలా మారి ఆ తల్లిదండ్రులను జైలుపాలు చేసింది.
దీనికి సంబంధించి ఇవాళ నార్వే పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. బాలుడిని కొట్టిన నేరానికి గాను 18నెలలు తండ్రికి, 15నెలలు తల్లికి జైలు శిక్ష విధించాలని వారు కోర్టుకు విన్నవించారు. కోర్టు తీర్పు మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 3న వెలువడుతుంది. దంపతులను జైల్లో పెట్టారని తెలుసుకున్న బంధువులు భారత ప్రభుత్వం కలుగజేసుకుని విడిపించాలని కోరుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన అనుపమ, గుడివాడ సమీపంలోని దొండపాడుకు చెందిన చంద్రశేఖర్‌లు నగరానికి వచ్చారు. మియాపూర్ ఎ.ఎస్.రాజునగర్‌లోని మృదుల అపార్టుమెంటులో వుంటున్నారు. నాలుగేళ్ల క్రితం టిసిఎల్‌లో ఉద్యోగం రావడంతో నార్వే దేశంలోని ఓస్లో నగరానికి వెళ్లారు. కొడుకు సాయిశ్రీరాం (7), పాప అభినవ (3) వారివెంటే వున్నారు.
కాగా కొడుకును అక్కడి స్కూల్లో చేర్పించారు. తీసుకెళ్లడానికి తండ్రి వస్తానని చెప్పడంతో స్కూల్లోనే వుండిపోయాడు. వెళ్లిపొమ్మని టీచర్ చెప్పగా తిడతారని చెప్పి అక్కడే ఉండిపోయాడు. మరోసారి యూనిఫాంలో మూత్రం పోసుకోగా ఇంటికి వెళ్లి మార్చుకు రమ్మనడంతో భయపడి వెళ్లలేదు. అనుమానం వచ్చిన టీచర్ అక్కడి ప్రభుత్వ బాలల సంక్షేమ కేంద్రానికి సమాచారం అందించింది. ఆ బాలుడిని వారం రోజులు తమ అధీనంలోనే వుంచుకుని తిరిగి ఇంటికి పంపించారు. అక్కడి ప్రభుత్వ తీరుతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చినపుడు వదిలేసి వెళ్లిపోయారు.
సెప్టెంబర్ 23న భార్యాభర్తలు తిరిగి వెళ్లగా రెండురోజుల క్రితం వారిని అరెస్టుచేసి జైల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తల్లిదండ్రులు లక్ష్మి, సత్యనారాయణ, అనుపమ తల్లిదండ్రులు ప్రసన్న, వీరభద్రం బంధువులు అయోమయంలో పడి ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వాన్ని సాయం కోసం అర్థిస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more